
New Energy Policy in Telangana | రాష్ట్రంలో త్వరలో కొత్త విద్యుత్ పాలసీ
New Energy Policy in Telangana | తెలంగాణలో త్వరలో నూతన ఎనర్జీ పాలసీని తీసుకు వొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం విద్యుత్ రంగంలో మేధావులు, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti vikramarka) పలు కీలక విషయాలు వెల్లడించారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో రూ.35 వేల కోట్లతో చేపట్టిన వైటీపీఎస్ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డిలు సందర్శించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ కు రామగుండం నుంచి సరఫరా అయ్యే బొగ్గు గూడ్స్ వ్యాగిన్ కు జెండా ఊపి మంత్రులు ప్రారంభించారు. ప్లాంట్ ను సందర్శించిన మంత్రులు పవర్ ప్లాంట్ మొదటి యూనిట్ ఆయిల్ సింక్రనైజేషన్ ను మంత్రులు ఈ సందర్భంగా ప్రారంభించారు.ఇప్పటికే రెండో యూనిట్‌ను సెప్టెంబర్ 11న...