Coach Restaurant | భోజన ప్రియులకు సంతోషకరమైన వార్త! భారతీయ రైల్వేలు అత్యాధునిక రీతిలో రూపొందించిన రైల్ కోచ్ రెస్టారెంట్.. రైలు ప్రయాణీకులు, సామాన్య ప్రజలకు ఎంతో దగ్గరయ్యాయి. ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ కోచ్ రెస్టారెంట్లు ప్రజాదరణ పొందాయి. తాజాగా వరంగల్ రైల్వే స్టేషన్లో త్వరలో ఈ చక్రాలపై రెస్టారెంట్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
వరంగల్ రైల్వే స్టేషన్లో త్వరలో ”కోచ్ రెస్టారెంట్’ ఏర్పాటు చేయనున్నట్లు సికింద్రాబాద్ డివిజనల్ ఏడీఆర్ఎం(ఐ) గోపాల్ తెలిపారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా వరంగల్ రైల్వేస్టేషన్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన అధికారులతో కలిసి ఇటీవల పరిశీలించారు. IOW కార్యాలయం ఎదుట త్వరలో ఏర్పాటు చేయనున్న కోచ్ రెస్టారెంట్ స్థలాన్ని, అలాగే మొదటి ప్లాట్ ఫాం వైపు ఉన్న ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్ పనులను కూడా ఆయన పరిశీలించారు.
ఈ కోచ్ రెస్టారెంట్ ఏంటి?
Rail Coach Restaurant స్థానిక ప్రజలకు, రైల్వే ప్రయాణికులకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది, ఇది 24 గంటలపాటు సేవలను అందిస్తుంది. ఇది ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చడానికి ఉత్తమమైన నాణ్యమైన ఆహారాన్ని అందిస్తుంది. కోచ్ రెస్టారెంట్ లోపలి వాతావరణం ప్రయాణికులు, అలాగే ప్రజలు కూడా చక్కగా భోజన అనుభవాన్ని ఆస్వాదించే విధంగా అలంకరిస్తారు. వివిధ ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ యాప్‌ల ద్వారా ప్రయాణీకుడు ఈ కోచ్ రెస్టారెంట్ ఆహారాన్ని పొందవచ్చు.
ఈ సదుపాయంతో, ఎవరైనా టేక్ అవే కౌంటర్ల నుంచి వారి ఆర్డర్‌లను కూడా తీసుకోవచ్చు
రైల్ కోచ్ రెస్టారెంట్ ప్రజలకు విభిన్నమైన ఆహార పదార్థాలను అందిస్తుంది. పుణేలోని కోచ్ రెస్టారెంట్ లో ఇది రాజ్ కచోరీ, చోళ భతురా, పౌ భాజీ, వెజ్ థాలీ, కాంబో, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, ప్యాక్ స్వీట్స్, నమ్‌కీన్స్, చాట్స్, బెవరేజెస్, సాఫ్ట్, ట్రెడిషనల్ ఇండియన్ స్వీట్స్ మొదలైన అనేక రకాల ఆహార ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వరంగల్ విషయానికొస్తే స్థానిక వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..