
Coach Restaurant | వరంగల్ రైల్వే స్టేషన్ లో త్వరలో కోచ్ రెస్టారెంట్..
Coach Restaurant | భోజన ప్రియులకు సంతోషకరమైన వార్త! భారతీయ రైల్వేలు అత్యాధునిక రీతిలో రూపొందించిన రైల్ కోచ్ రెస్టారెంట్.. రైలు ప్రయాణీకులు, సామాన్య ప్రజలకు ఎంతో దగ్గరయ్యాయి. ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ కోచ్ రెస్టారెంట్లు ప్రజాదరణ పొందాయి. తాజాగా వరంగల్ రైల్వే స్టేషన్లో త్వరలో ఈ చక్రాలపై రెస్టారెంట్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు.వరంగల్ రైల్వే స్టేషన్లో త్వరలో ''కోచ్ రెస్టారెంట్' ఏర్పాటు చేయనున్నట్లు సికింద్రాబాద్ డివిజనల్ ఏడీఆర్ఎం(ఐ) గోపాల్ తెలిపారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా వరంగల్ రైల్వేస్టేషన్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన అధికారులతో కలిసి ఇటీవల పరిశీలించారు. IOW కార్యాలయం ఎదుట త్వరలో ఏర్పాటు చేయనున్న కోచ్ రెస్టారెంట్ స్థలాన్ని, అలాగే మొదటి ప్లాట్ ఫాం వైపు ఉన్న ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్ పనులను కూడా ఆయన పరిశీలించారు.
ఈ కోచ్ రెస్టారెంట్ ఏంటి?
Rail Coach R...