Weather Report | తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో పలు జిల్లాల్లో వడగాల్పులు (Heat Waves) వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. అలాగే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఏప్రిల్ 18న గురువారం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, , సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లో వేడిగాలులు (Heat Waves) వీస్తాయని తెలిపింది. అలాగే 9వ తేదీన ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, , మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేటజిల్లాలో వడగాలులు వీస్తాయని పేర్కొంది. 20న రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే చాన్స్ ఉందని చల్లని కబురు చెప్పింది. భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..