Amethi | న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ తన అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. హస్తం పార్టీకి కంచుకోటలా ఉన్న ఈ స్థానంలో పార్టీ ఎవరిని నిలుపుతుందనే దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు విలేకరుల సమావేశంలో సస్పెన్స్‌ను కొనసాగించారు. అమేథీలో ఎవరు ఉంటారు అని విలేఖరులు అడుగగా, “ఇది బిజెపి ప్రశ్న, చాలా బాగుంది. నాకు పార్టీ ఏ ఆదేశాలు జారీ చేసినా దానిని నేను అనుసరిస్తాను. మా పార్టీలో, ఈ (అభ్యర్థుల ఎంపిక) నిర్ణయాలన్నీ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ తీసుకుంటుంది” అని రాహుల్ గాంధీ అన్నారు. తాను పార్టీకి సైనికుడినని, కమిటీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు.
ఒకప్పుడు గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న అమేథీ 2019 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఇప్పటికే వాయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ.. అమేథీ నుంచి కూడా పోటీ చేస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
గతంలో తన మామ సంజయ్ గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ, ఆ తర్వాత తల్లి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహించిన అమేథీ సీటును తిరిగి గెలవడానికి 53 ఏళ్ల రాహుల్ పోటీ చేయాలని భావిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కూడా అమేథీ ప్రజలు తమకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నారని, సరైన సమయంలో లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అమేథీ నుంచి కాంగ్రెస్ ఎవరు పోటీ చేస్తారు? రాహుల్ గాంధీ తన నిర్ణయం కాదన్నారు. సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
“నేను అమేథీ (Amethi) కి ప్రాతినిధ్యం వహించాలని, వారి ప్రాంతానికి వెళ్లి, సమస్యలు వినాలని, తద్వారా వారు అభివృద్ధి చెందాలని ప్రజలు కోరుకుంటున్నారు. నేను కూడా రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తితో ఉన్నాను. అయితే సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాను. ఇప్పుడే తొందర లేదు అని రాబర్ట్ వాద్రా విలేకరులతో అన్నారు. ఇదిలా ఉండగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని స్మృతి ఇరానీ అమేథీలో ఓడించగా.. ఆ స్థానంలో రాహుల్ 15 ఏళ్ల ప్రస్థానాన్ని ముగించారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..