Medchel : దేశంలో రైల్వే సేవల విస్తరణ..అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిస్తోందని రూ.2వేల కోట్లతో జంట నగరాల్లోని రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులను మోదీ ప్రభుత్వం చేపట్టిందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ (MP Etela Rajender) తెలిపారు. మేడ్చల్ రైల్వేస్టేషన్, ఆర్‌యూబీ పనులను గురువారం ఆయన పరిశీలించి, రైల్వే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో ఎంపీ ఈటల మాట్లాడారు. ప్రధాని మోదీ చొరవతోనే జంటనగరాల్లో నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్, చర్లపల్లి రైల్వే స్టేషన్ల అత్యాధునిక సౌకర్యాలతో విమానాశ్రయాలను తలపిచేలా ఆధునీకరిస్తున్నారని తెలిపారు.
మేడ్చల్ రైల్వేస్టేషన్ అభివృద్ధి
మేడ్చల్ రైల్వేస్టేషన్ లో (Medchel Railways Station) లో రూ.32 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎంపీ ఈటల రాజేందర్ చెప్పారు. గౌడవెల్లి, గుండ్లపోచంపల్లి, బొల్లారం, అల్వాల్, అమ్మగూడ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. మెట్రోరైల్ మాదిరిగా ఎంఎంటీఎస్ కి కూడా దగ్గరగా స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారని, కేంద్ర మంత్రిని కలిసిన తర్వాత సికింద్రాబాద్ లో ఉన్నతాధికారులను పంపించారని తెలిపారు.
కాగా, బొల్లారం, వినాయక నగర్ గేట్ల వద్ద రెండు గంటలు పడుతోందని, ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని చెప్పారని, అమ్మగూడెం అండర్ పాస్ వద్ద ట్రాఫిక్ జామ్ అవుతుందని ప్రజలు ఫిర్యాదు చేశారని తెలిపారు. మరో 20 ఏళ్ల పాటు ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకొని అండర్ పాస్ లను అభివృద్ధి చేస్తామని ఈటల రాజేందర్ తెలిపారు. మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని రైల్ నిలయం, రైల్వే ఆస్తులు, చర్లపల్లి టెర్మినల్, అనేక రైల్వేలైన్లు ఉన్నాయని, వాటిన్నింటిని పరిశీలించి ఎక్కడెక్కడ ఏమేం కావాలో పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఈటల పేర్కొన్నారు.
మేడ్చల్ రైల్వే స్టేషన్, RUB పనులను పరిశీలించి, రైల్వే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అధికారులు సీపీఎం జీఎస్ శ్రీఏకే సింగ్ గారు, సీనియర్ డీ.ఈ.ఎన్ కోఆర్డినేషన్ శ్రీ ఏ ముత్యాల నాయుడు… pic.twitter.com/1LO63SXfdL
— Eatala Rajender (@Eatala_Rajender) July 11, 2024
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..