
Rainfall | తెలంగాణలో నేటి నుంచి భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం
Rainfall | హైదరాబాద్: తెలంగాణ లో జూలై 12 నుంచి 15 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. రాష్ట్రంలో పలుజిల్లాల్లో సరైన వర్షాలు కురవకపోవడంతో కరువు పరిస్థితులు వస్తయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.ఈ క్రమంలోనే వాతావరణ కేంద్రం వర్షాలకు సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చింది. శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయని తెలిపింది. ఈమేరకు భారత వాతావరణ శాఖ (IMD) అనేక జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.హైదరాబాద్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్లానింగ్ డెవలప్‌మెంట్ అండ్ సొసైటీ డేటా ప్రకారం, రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి హైదరాబాద్ పరిధిలో 174.6 మిమీ వర్షపాతం నమోదైంది. ఇక్కడ సాధారణ పరిధి 154 ...