BSNL MNP Online | దేశంలోని ప్రముఖ టెలికాం ఆపరేటర్లు అయిన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ ఐడియావొడఫోన్ రీఛార్జ్ ప్లాన్‌లు ఖరీదైనవిగా మారాయి. రీచార్జి ప్లాన్లను పెంచడంతో పేద మధ్యతరగతి వినియోగదారులు విలవిలలాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో కస్టమర్ల చూపు BSNL వైపు వేగంగా మారుతోంది. ఇప్పుడు టెలికాం రంగంలో వినియోగదారులకు అతి తక్కువ ధరకు ఉచిత కాలింగ్‌తో పాటు దీర్ఘకాల వ్యాలిడిటీని అందజేస్తున్న ఏకైక సంస్థ BSNL. ప్రైవేట్ కంపెనీల ధరల పెంపు తర్వాత, BSNL తన పోర్ట్‌ఫోలియోకు కొత్త చవకైన ప్లాన్‌లను నిరంతరం అందిస్తోంది.
Port to BSNL : మీరు 1900కి SMS పంపడం ద్వారా ప్రత్యేక పోర్టింగ్ కోడ్ (UPC)ని పొందాలి. ‘PORT [స్పేస్] 10 అంకెల మొబైల్ నంబర్’ అని టైప్ చేయండి.. కాగా జమ్మూకశ్మీర్ లో ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్‌ల విషయంలో మాత్రం SMS పంపడానికి బదులుగా 1900కి కాల్ చేయాల్సి ఉంటుంది.
జమ్మూ & కాశ్మీర్, అస్సాం, నార్త్ ఈస్ట్ లైసెన్స్‌లు మినహా అన్ని సర్వీస్ ప్రాంతాలకు, అభ్యర్థన తేదీ లేదా నంబర్ పోర్ట్ చేయబడిన సమయం నుంచి 15 రోజుల పాటు UPC కోడ్ చెల్లుబాటు అవుతుంది. మిగతా ప్రాంతాల్లో UPC 30 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది.
తర్వాత మీరు మీ మొబైల్ నంబర్‌ను పోర్ట్ చేయడానికి BSNL CSC (కస్టమర్ సర్వీస్ సెంటర్) / అధీకృత ఫ్రాంఛైజీ/రిటైలర్‌ను సందర్శించాలి. CAF (కస్టమర్ అప్లికేషన్ ఫారమ్) పూరించండి. ప్రాసెసింగ్ కు సంబంధించిన పోర్టింగ్ ఫీజు చెల్లించండి.
BSNL లోకి పోర్ట్ చేయడానికి BSNL ఎటువంటి రుసుములను వసూలు చేయదు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..