Warangal | సమస్యలను వెలికితీయడమే కాదు.. పరిష్కార మార్గాలను కూడా సూచించండి..
జర్నలిస్టులకు పోలీసుల నుంచి ఇబ్బందులు లేకుండా చేస్తా..
పోలీస్‌కమిషనర్ అంబర్ కిషోర్ ఝాWarangal: వర్కింగ్ జర్నలిస్టులకు పోలీస్ శాఖ నుంచి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ (Warangal CP) అంబర్ కిషోర్ ఝా అన్నారు. జర్నలిస్టులు సమస్యలను వెలికితీయడంతోపాటు, పరిష్కార మార్గాలను కూడా సూచించాలని కోరారు. హైదరాబాద్, బెంగళూర్, మైసూర్ వంటి నగరాలతో సమానంగా గ్రేటర్ వరంగల్ నగరం అభివృద్ధి చెందాలంటే జర్నలిస్టులు కీలక పాత్ర పోషించాలని అన్నారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ సభ్యులకు ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య, కోశాధికారి బోళ్ల అమర్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ మీటింగ్ హాల్‌లో బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా సీపీ అంబర్...