హైదరాబాద్ లోని శివారు ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్ (Hyderbad IT Corridor)కు టీజీ ఆర్టీసీ బస్సు సర్వీసులను పెంచింది. గ్రేటర్ శివారు ప్రాంతాల నుంచి ప్రతి రోజు లక్షలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఇప్పటివరకు సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో ఎక్కువ మంది సొంత వాహనాలపైనే వస్తున్నారు. ఈ క్రమంలోనే టీజీ ఆర్టీసీ ఫోకస్ పెట్టింది. గురువారం నుంచి ఘట్‌కేసర్ (Ghatkesar), రాజేంద్రనగర్ ( Rajendranagar) ప్రాంతాల నుంచి కొండాపూర్‌కు కొత్తగా సర్వీసులను ప్రారంభించనుంది.
టీజీ ఆర్టీసీ కొత్తగా 282కే, 215 రూట్లలో ఘట్‌కేసర్, రాజేంద్రనగర్ ప్రాంతాల నుంచి కొండాపూర్(Kondapur) వెళ్లేందుకు గురువారం నుంచి కొత్తగా బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. కాచిగూడ డిపోకు చెందిన రెండు మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులను ఘట్‌కేసర్ నుంచి కొండాపూర్‌కు, రాజేంద్రనగర్ డిపో నుంచి రెండు ఆర్డినరీ బస్సులను 215 మార్గంలో రాజేంద్రనగర్ నుంచి అరాంఘర్ మీదుగా కొండాపూర్‌కు రెండు సర్వీసులు నడిపిస్తున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపించనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ ఈడీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. అలాగే డిపోల వారీగా కొత్త రూట్లను పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
బస్సు వేళలు
Bus Service to Hyderbad IT Corridor ప్రయాణికుల రద్దీ నివారించేందుకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు కొండాపూర్‌కు రెండు రూట్లలో బస్సులను నడిపిస్తోంది. 282కే రూట్‌లో ఘట్‌కేసర్ నుంచి వయా యామనపేట, రాంపల్లి, రాంపల్లి ఎక్స్‌రోడ్, నాగారం, కుషాయిగూడ, ఎన్‌ఎఫ్‌సీనగర్, ఇండస్టియల్‌ఎస్టేట్, లాలాపేట, తార్నాక, శంకర్‌మఠ్, నారాయణగూడ((Narayanaguda), మాసబ్‌ట్యాంక్ (Masabtank), ఎంపీఎక్స్‌రోడ్, నానల్‌నగర్, దర్గా, గచ్చిబౌలి, బయో డైవర్సిటీ, ఐకియా, హైటెక్ సిటీ, కొండాపూర్‌కు రెండు మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులను గురువారం నుంచి నడుపుతోంది. ఘట్‌కేసర్ నుంచి మొదటి బస్సు ఉదయం 6.10 గంటలకు, చివరి బస్సు మధ్యాహ్నం 3.40 గంటలకు, కొండాపూర్ నుంచి మొదటి బస్సు ఉదయం 8.40 గంటలకు, చివరి బస్సు సాయంత్రం 6.25గంటలకు ప్రారంభమవుతాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఇక 215 మార్గంలో ఆరాంఘర్, రాజేంద్రనగర్ నుంచి వయా వీకర్ సెక్షన్ కాలనీ, డైరీ ఫామ్, ఉప్పర్‌పల్లి, హైదర్‌గూడ, జ్యోతి నగర్, బృందావన కాలనీ, దర్గా, కాజాగూడ ఎక్స్ రోడ్, బయో డైవర్సిటీ, ఐకియా, రాయదుర్గం, హైటెక్ సిటీ – సైబర్‌టవర్స్, కొత్తగూడ ఎక్స్‌రోడ్ మీదుగా కొండాపూర్ వరకు రెండు బస్సులు నడుపుతున్నారు. ఆరాంఘర్ నుంచి మొదటి బస్సు ఉదయం 7.20 గంటలకు, లాస్ట్ బస్సు రాత్రి 9.15 గంటలకు, కొండాపూర్ నుంచి మొదటి బస్సు ఉదయం 8.30 గంటలకు, చివరి బస్సు రాత్రి 10.25గంటల కు అందుబాటులో ఉంటుందని అధికారులు వెల్లడించారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..