warangal: వరంగల్ 16వ డివిజన్ కీర్తినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ నిమిషాంబ దేవాలయం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి.
మొదటిరోజు ఆదివారం ఉదయం గణపతి పూజ, పుణ్యహావచనం, అంకురార్పణ, అభిషేకం, రక్షాబంధనం, కలశస్థావన, అఖండదీపం కార్యక్రమాలు జరగయి.. తొలిరోజు అమ్మవారు బాలత్రిపుర సుందరి (Bala Tripura Sundari Devi) గా దర్శనమిచ్చారు.
అర్చకులు కళ్యాణ్ మధ్యాహ్నం వేదమంత్రోచ్ఛరణలతో హోమ, కుంకుమ పూజలు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
సాయంత్రం చిన్నారి విశ్వాని పొడిశెట్టి బాలత్రిపుర సుందరి దేవి అలంకరణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులందరు.. అమ్మవారికి పూజలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు..
వరంగల్ కీర్తినగర్ లోని శ్రీ నిమిషాంబ దేవీ ఆలయంలో కనుల పండువగా శరన్నవరాత్రి వేడుకలు.. బాలత్రిపుర సుందరి దేవీ అలంకరణ లో ఉన్న చిన్నారి విశ్వానికి భక్తి శ్రద్దలతో పూజలు.. #warangal #DurgaPuja #duss pic.twitter.com/siLP7dWZZP
— Vande bhaarath (@harithamithra1) October 15, 2023
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.