
warangal: వరంగల్ జిల్లా కీర్తినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ నిమిషాంబ దేవాలయం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు (Nimishamba Devi Sharan Navaratri Utsavalu) సిద్ధమైంది. గత నెల వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రతీరోజు కుంకుమ పూజలు, వ్రతాలు, హోమాలతో సందడి నెలకొనగా తాజాగా దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 15 నుంచి 24 వరకు దేవీ శరన్నరాత్రి ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి.
నవరాత్రి ఉత్సవాలను (Nimishamba Devi Sharan Navaratri Utsavalu) శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయకమిటీ ప్రకటించింది. మొదటిరోజు అక్టోబర్ 15 ఆదివారం ఉదయం 6 గంటలకు గణపతి పూజ, పుణ్యహావచనం, అంకురార్పణ, అభిషేకం, రక్షాబంధనం, కలశస్థావన, అఖండదీపం కార్యక్రమాలు ఉంటాయి. 15వ తేదీ నుంచి 24న విజయదశమి రోజు వరకు నిమిషాంబ దేవి అమ్మవారు ఒక్కొ రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. విజయదశమి మంగళవారం ఉదయం అమ్మవారిని అభిషేకించి, కలశ ఉద్వాసన, పూర్ణాహుతి చేసిన తదుపరి అమ్మవారికి విశేషపూజలు, అర్చనలు, మంగళహారతులు, తీర్ధప్రసాద వితరణ ఉంటుంది. సాయంత్రం 5-00 గం॥లకు జమ్మిపూజ, అదేరోజు రాత్రి 9 గంటలకు కుంభ బలి, కూష్మాండబలి ఇచ్చి ధ్వజపట అవరోహణతో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు పరిసమాప్తమవుతాయని ఆలయకమిటీ ప్రతినిధులు, అర్చకులు కళ్యాణ్ తెలిపారు

అమ్మవారి ప్రతిరోజు అవతారాలు
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతీ రోజు ఉదయం 9 గంటలకు అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అభిషేకం, అష్టోత్తర పూజలు, అర్చనలు, సాయంత్రం వేదపారాయణం, మంగళహారతులు ఇతర పూజలు నిర్వహించనున్నారు. అలాగే ప్రతీ రోజు ఉదయం 11గంటలకు చండీహోమం నిర్వహించనున్నామని ఆలయ కమిటీ బాధ్యులు తెలిపారు.
- 15న ఆదివారం శ్రీ బాలత్రిపుర సుందరిదేవి అవతారం,
- 16న సోమవారం -శ్రీ గాయత్రి దేవి అవతారం
- 17న మంగళవారం శ్రీఅన్నపూర్ణ దేవి అవతారం
- 18న బుధవారం శ్రీ మహాలక్ష్మి దేవి అవతారం.
- 19న గురువారం. శ్రీ చండీ దేవి అవతారం
- 20న శుక్రవారం శ్రీ సరస్వతిదేవి అవతారం
- 21న శనివారం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అవతారం
- 22న ఆదివారం దుర్గాదేవి అవతారం
- 23న సోమవారం శ్రీ మహిషాసురమర్ధిని అవతారం
- 24న మంగళవారం శ్రీనిమిషాంబ/రాజరాజేశ్వరిదేవి అవతారం (విజయదశమి)
ఇతర వివరాల కోసం ఆలయ కమిటీ ప్రతినిధులను 7702401936, 8106346086, 9346877937 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.