HYD Metro | హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ నుంచి ఎల్ అండ్ టీ ఔట్ ? ఉచిత బస్సు ప్రయాణమే కారణమా?
HYD Metro | హైదరాబాద్ మెట్రోను విక్రయించేందుకు ఎల్ అండ్ టీ సంస్థ రెడీ అయింది. ఇటీవల సంస్థకు భారీగా నష్టాలు వస్తుండడంతో చివరకు హైదరాబాద్ మెట్రోను విక్రయించాలని నిర్ణయించింది. అయితే ఈ ప్రక్రియను 2026 తర్వాత మొదలు పెట్టాలని ఎల్ అండ్ టీ ప్రెసిడెంట్ ఆర్ శంకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌లో 90 శాతం ఎల్‌అండ్‌టీకి ఉండగా, మిగిలిన 10 శాతం తెలంగాణ ప్రభుత్వానిది. మెట్రో వ్యవస్థను నిర్వహించేందుకు కంపెనీకి 65 ఏళ్ల రాయితీ ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత బస్సు పథకం కారణంగా మెట్రో రైళ్లలో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పడిపోయిందని, ఫలితంగా తీవ్రంగా నష్టాలు వచ్చాయని L&T సంస్థ ప్రెసిడెంట్ ఆర్ శంకర్ రామన్ అన్నారు. 2026 తర్వాత హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌ను విక్రయించాలని భావిస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణలో బస్సుల సంఖ్య పెరగనప్పటికీ మహిళలు బస్సుల్లో ఎక్కువగా ప్రయాణిస్తున్నారని అన్నారు. బస్సుల్లో సీట్లు లభించక పురుషులు HYD Metro రైళ్లను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. బస్సుల్లో డబ్బులు చెల్లించని మహిళలు, మెట్రోలో సగటున టికెట్‌పై రూ.35 చెల్లించే పురుషులు ప్రయాణిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవను ఆయన ప్రశంసిస్తూనే, హైదరాబాద్ వంటి నగరం కేవలం కాలుష్య కారకమైన వాహనాలపైనే ఆధారపడదని, ఈ చర్య “అనూహ్యమైనది” అని అన్నారు. ” ఉచిత ప్రయాణ పథకం కారణంగా మహిళలందరూ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. దీని వల్ల మెట్రో ప్రయాణికుల సంఖ్య ఆశించినంతగా పెరగడం లేదు. బస్సులు ప్రతీ ఐదేళ్లకు ఒకసారి మెయింటేనెన్స్ చేయాల్సి వస్తుంది. అయితే బస్సుల్లో ఉచితంగా ఇలా ఫ్రీగా ప్రయాణిస్తున్నందు వల్ల బస్సుల మెయింటేనెన్స్‌కు డబ్బులు ఎలా వస్తాయి. రాజకీయ పార్టీ హామీల కోసం పెట్టిన ఈ స్కీం తెలంగాణ రవాణా సంస్థని అప్పుల పాలు చేస్తుందని శంకర రామన్ తెలిపారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..