Protests in PoK : పాక్ ఆక్రమిత కశ్మీర్ (Pakistan-occupied Kashmir) అట్టుడుకుతోంది. నిరసనకారులు భద్రతా బలగాల మధ్య ఘర్షణలు (Violence) చెలరేగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం జరిగిన ఘర్షణల్లో ఒక పోలీసు అధికారి మరణించగా, మరో 90 మంది గాయపడ్డారు. ముజఫరాబాద్‌లో హింస చెలరేగడంతో మిర్పూర్, ఆజాద్ జమ్మూ అండ్ కాశ్మీర్ (ఎజెకె)లో మార్కెట్లు, పాఠశాలలు, కార్యాలయాలు వరుసగా రెండవ రోజు కూడా వేసివేశారు. అవామీ యాక్షన్ కమిటీ (AAC) శుక్రవారం ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా PoK లోని కొన్ని ప్రాంతాల్లో నిరసనలు చేపట్టింది. ఆందోళనలను అణచివేసేందుకు పాకిస్తాన్ భద్రతా దళాలు యత్నించగా ప్రజలు తిరగబడ్డారు. ముజఫరాబాద్‌లో వీల్-జామ్, షట్టర్-డౌన్ సమ్మె కారణంగా మే 10న సాదారణ జనజీవనం స్తంభించిపోయింది.
అధిక పన్నులు, విద్యుత్ బిల్లులు, ద్రవ్యోల్బణం (Inflation) ఒక్కసారిగా పెరగడంతో పీవోకేలోని ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబికింది. ఈ క్రమంలో శాంతియుత నిరసనకు AAC పిలుపునిచ్చింది. ప్రజల గృహాలు, మసీదుల చుట్టూ పోలీసులు టియర్ గ్యాస్ షెల్లింగ్‌ను ఆశ్రయించడంతో ఘర్షణలు చెలరేగాయని స్థానిక మీడియా నివేదించింది. దీంతో సమహ్ని, సెహన్స, మీర్పూర్, రావాలకోట్, ఖుయిరట్టా, తట్టపాని మరియు హత్తియాన్ బాలా వంటి అనేక ప్రాంతాలలో సమ్మెలకు పిలుపునిచ్చారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఏం జరుగుతోంది?
- Protests in PoK | పీవోకేలో ఒక్కసారిగా అధికంగా పన్నులు, విద్యుత్ చార్జీలు, ద్రవ్యోల్భనం పెరిగిపోవడంతో ప్రజలు నిరసనకు దిగారు. ఈ క్రమంలో అవామీ యాక్షన్ కమిటీ పీఓకే లోని ముజఫరాబాద్‌లో గత శుక్రవారం శాంతియుతంగా కవాతు నిర్వహించించింది. ఇస్లాం గర్ సమీపంలో ప్రదర్శనకారులు, పోలీసులు ఘర్షణ పడడంతో నిరసనలు హింసాత్మకంగా మారాయని జియో న్యూస్ నివేదించింది.
- AAC ముజఫరాబాద్‌లో బంద్, శాంతియుత నిరసనకు పిలుపునిచ్చింది. దీంతో వ్యాపారాలన్నీ నిలిచిపోయాయి. ఈ క్రమంలో ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు నగరానికి వెళ్లే రహదారులకు అడ్డంగా బారికేడ్లు వేయడంతో ఘర్షణకు దారితీసింది. రాత్రిపూట దాడులు నిర్వహించి పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడంతో కమిటీ శనివారం సమ్మెకు పిలుపునిచ్చింది.
- పీఓకే ప్రభుత్వం ఆ ప్రాంతంలో సెక్షన్ 144 విధించగా , మే 10, 11వ తేదీల్లో విద్యా సంస్థలు, కార్యాలయాలను మూసివేసి, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని అన్ని జిల్లాల్లోని ప్రజలు శనివారం వేలాదిగా తరలివచ్చారు.
- సోషల్ మీడియాలో నిరసనకారులపై లాఠీలను ప్రయోగించడం, టియర్ గ్యాస్ ఉపయోగించి గుంపును చెదరగొట్టడానికి ప్రయత్నించడం వంటి వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. హింసాత్మక ఘర్షణల తర్వాత శుక్రవారం డజన్ల కొద్దీ పోలీసు సిబ్బంది, నిరసనకారులు గాయపడ్డారని జియో న్యూస్ నివేదించింది.
- నిరాయుధులైన పౌరులపై పాకిస్థాన్ బలగాలు కాల్పులు జరుపుతున్నాయని, ఈ ఘర్షణల్లో కనీసం ఇద్దరు మరణించారని తెలుస్తోంది. హింసలో ఒక పోలీసు ఎస్‌హెచ్‌ఓ కూడా మరణించారని, నిరసనకారులు కొట్టి చంపారని సమాచారం.
- అయితే భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని పీవోకే వాసులు కొందరు కోరుతున్నారు. పరిస్థితి చేయి దాటిపోతోంది.భారతదేశం ఇప్పుడు తన దృష్టిని పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌పై కేంద్రీకరించాలని, గిల్గిట్-బాల్టిస్తాన్‌తో సహా ఈ ఆక్రమిత భూభాగం యొక్క స్వాతంత్ర్యానికి సహాయం చేయాలని కోరుతున్నారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..