HYD Metro | హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ నుంచి ఎల్ అండ్ టీ ఔట్ ? ఉచిత బస్సు ప్రయాణమే కారణమా?
HYD Metro | హైదరాబాద్ మెట్రోను విక్రయించేందుకు ఎల్ అండ్ టీ సంస్థ రెడీ అయింది. ఇటీవల సంస్థకు భారీగా నష్టాలు వస్తుండడంతో చివరకు హైదరాబాద్ మెట్రోను విక్రయించాలని నిర్ణయించింది. అయితే ఈ ప్రక్రియను 2026 తర్వాత మొదలు పెట్టాలని ఎల్ అండ్ టీ ప్రెసిడెంట్ ఆర్ శంకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌లో 90 శాతం ఎల్‌అండ్‌టీకి ఉండగా, మిగిలిన 10 శాతం తెలంగాణ ప్రభుత్వానిది. మెట్రో వ్యవస్థను నిర్వహించేందుకు కంపెనీకి 65 ఏళ్ల రాయితీ ఉంది.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత బస్సు పథకం కారణంగా మెట్రో రైళ్లలో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పడిపోయిందని, ఫలితంగా తీవ్రంగా నష్టాలు వచ్చాయని L&T సంస్థ ప్రెసిడెంట్ ఆర్ శంకర్ రామన్ అన్నారు. 2026 తర్వాత హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌ను విక్రయించాలని భావిస్తున్నట్లు చెప్పారు.తెలంగాణలో బస్సుల సంఖ్య పెరగనప్పటికీ మహిళలు బస్సుల్లో ఎక్కువగా ప...