వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లదాడికి పాల్పడిన కీలక నిందితుడి అరెస్ట్
Stone-Pelting on Trains | ఉత్తరప్రదేశ్ వారణాసిలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ( Vande Bharat Express ) రైలుపై రాళ్ల దాడి ఘటనలకు కారణమైన ముఠాతో సంబంధం ఉన్న మోస్ట్ వాంటెడ్ నిందితుడిని ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) విజయవంతంగా పట్టుకుంది. రైలు ప్రమాదాలకు కారకులయ్యేవారిని గుర్తించడానికి, నియంత్రించడానికి ATS విస్తృత దర్యాప్తు చేస్తోంది.ఇదులో భాగంగా నిందితుడు పవన్ కుమార్ సహాని అనే అనుమానితుడిని అరెస్టు చేశారు. గతంలో వ్యాస్‌నగర్, కాశీ స్టేషన్ ప్రాంతాల్లో రాళ్లదాడి ఘటనలకు సంబంధించి రైల్వే చట్టంలోని సెక్షన్ 153 కింద దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ నంబర్ 324/2024కి సంబంధించి అరెస్టు చేశారు. విచారణలో, హుస్సేన్ అలియాస్ షాహిద్ అని పిలిచే మరొక నిందితుడి పేరును పవన్ కుమార్ సహాని బయటపెట్టాడు. ఈ క్లూ ఆధారంగా ATS నిఘా సమాచారాన్ని సేకరించి, చందౌలీలోని మొఘల్ సరాయ్‌లో అద్దెకు ఉంటున్న హుస్సేన్‌ను...