దుర్గాదేవి తొమ్మిది రూపాల్లో వెలిసిన అమ్మవారి ఆలయాలు ఎక్కడున్నాయో తెలుసా.. ?
Durga Navratri 2024 : 'నవరాత్రి' అంటే అక్షరాలా తొమ్మిది రాత్రులు. ఈ తొమ్మిది రాత్రులు దుర్గామాతను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. మహిషాసురుడనే రాక్షసుడిని చంపిన తర్వాత దుర్గాదేవి కైలాస పర్వతం నుంచి భూమిపై ఉన్న తన తల్లిగారి ఇంటికి తన ప్రయాణాన్ని ప్రారంభించిందని నమ్ముతారు. ఈ నవరాత్రులలో దుర్గామాత 9 స్వరూపాలను స్మరిస్తూ పూజలు (Durga Puja ) చేస్తారు. దేవీ నవరాత్రి ఉత్సవాలు వచ్చాయంటే చాలు భారతదేశమంతా పండుగ ఉత్సాహం ఉప్పొంగిపోతుంది. తొమ్మిది రోజలు పాటు అమ్మవారిని ఒక్కో అవతారంలో పూజలు చేసి తరిస్తారు. అయితే దుర్గాదేవి వివిధ రూపాలు, పేర్లు, వేడుకలు. పవిత్రమైన నైవేద్యాలు భిన్నమైనవి. కొందరు భక్తులు భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో వెలసిన అమ్మవారి వివిధ దేవాలయాలను సందర్శిస్తారు. ఈక్రమంలో తొమ్మిది అవతారాలు గల అమ్మవారి ఆలయాల గురించి ఒకసారి తెలుసుకుందాం. . గ చేయబడిన వివిధ ఆల...