Durga Navratri 2024 : ‘నవరాత్రి’ అంటే అక్షరాలా తొమ్మిది రాత్రులు. ఈ తొమ్మిది రాత్రులు దుర్గామాతను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. మహిషాసురుడనే రాక్షసుడిని చంపిన తర్వాత దుర్గాదేవి కైలాస పర్వతం నుంచి భూమిపై ఉన్న తన తల్లిగారి ఇంటికి తన ప్రయాణాన్ని ప్రారంభించిందని నమ్ముతారు. ఈ నవరాత్రులలో దుర్గామాత 9 స్వరూపాలను స్మరిస్తూ పూజలు (Durga Puja ) చేస్తారు. దేవీ నవరాత్రి ఉత్సవాలు వచ్చాయంటే చాలు భారతదేశమంతా పండుగ ఉత్సాహం ఉప్పొంగిపోతుంది. తొమ్మిది రోజలు పాటు అమ్మవారిని ఒక్కో అవతారంలో పూజలు చేసి తరిస్తారు. అయితే దుర్గాదేవి వివిధ రూపాలు, పేర్లు, వేడుకలు. పవిత్రమైన నైవేద్యాలు భిన్నమైనవి. కొందరు భక్తులు భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో వెలసిన అమ్మవారి వివిధ దేవాలయాలను సందర్శిస్తారు. ఈక్రమంలో తొమ్మిది అవతారాలు గల అమ్మవారి ఆలయాల గురించి ఒకసారి తెలుసుకుందాం. . గ చేయబడిన వివిధ ఆలయాలు ఉన్నాయి.
దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో అమ్మవారి దివ్య దర్శనం.. pic.twitter.com/eX9EWOjeER
— Vande bhaarath (@harithamithra1) September 30, 2024
దుర్గాదేవి 9 అవతారాల్లో వెలసిన 9 దేవాలయాలు
1వ రోజు- శైలపుత్రి ఆలయం, వారణాసి
దుర్గా దేవి మొదటి శక్తివంతమైన అభివ్యక్తి శైలపుత్రి అని నమ్ముతారు. శైలపుత్రి నవరాత్రుల మొదటి రోజున పూజించబడే (Durga Puja ) మొదటి నవదుర్గ. ఈ అమ్మవారు సతీ దేవి యొక్క పునర్జన్మ. ఆమె పర్వతాల రాజు (పర్వతరాజ్) కుమార్తె అయిన శైలపుత్రి అమ్మవారి ఎడమ చేతిలో పుష్పం, ఆమె కుడి చేతిలో త్రిశూలం, ఆమె తలపై అర్ధ చంద్రుడు ఉంటారు. అమ్మవారు వృషభంపై ఆసీనులై ఉంటారు.
2వ రోజు- బ్రహ్మచారిణి ఆలయం, వారణాసి
రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారు తెల్లని వస్త్రాలు ధరించి, సన్యాసం చేస్తూ పర్వతాలలో నివసిస్తుంది. బ్రహ్మేశ్వరాలయంలో బ్రహ్మచారిణి అమ్మవారు కొలువుదీరి ఉంటారు. ఇది వారణాసిలోని గంగా ఘాట్ వెంబడి ఉంది. మరొక ప్రసిద్ధ దుర్గా దేవాలయం బ్రహ్మేశ్వరాలయం.. ఇది కాశీలోని సప్తసాగర్‌లోని బాలాజీ ఘాట్ వద్ద గంగా నది సమీపంలో ఉంది.
3వ రోజు- చంద్రఘంటా దేవి ఆలయం, వారణాసి
చంద్రఘంటా దుర్గా, దుర్గాదేవి తొమ్మిది అవతారాల్లో మూడవ అవతారం. భక్తులు ఈ అమ్మవారిని చంద్రఖండ, చండికా, రణచండీ అని కూడా పిలుస్తారు. చంద్రఘంటా అంటే అర్ధచంద్రాకారంతో, గంట కలిగి ఉందని అని అర్ధం. నవరాత్రులలో పూజించే నవదుర్గల్లో మూడో అవతారమైన చంద్రఘంటా దేవి ధైర్యానికీ, శక్తికీ, తేజస్సుకూ ప్రతీకగా భక్తులు నమ్ముతారు. ఆమె మూడవ కన్ను తెరిచి ఉండి చేతుల్లో ఆయుధాలను పట్టుకుంది. ఈ అమ్మవారిని పూజిస్తే ధైర్యాన్ని ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢవిశ్వాసం. అమ్మవారి ప్రసిద్ధ నవ్ దుర్గా మందిరం కూడా వారణాసిలో చంద్రఘంట మందిరం అనే పేరుతో ఉంది.
4వ రోజు- కూష్మాండ ఆలయం, కాన్పూర్
దుర్గాదేవి నాల్గవ రూపం కూష్మాండ దేవి. కూష్మాండ దేవి పురాతన ఆలయం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఉంది. ఈ ఆలయంలో తల్లి కూష్మాండ పిండి రూపంలో ఉంటుంది. ఆలయంలో ప్రతిష్టించిన విగ్రహాలు రెండవ నుంచి పదవ శతాబ్దానికి చెందినవిగా పేర్కొంటారు. పురాణాల ప్రకారం.. ఈ ఆలయాన్ని అమ్మవారు తన చిరునవ్వుతో ప్రపంచాన్ని సృష్టించింది. బలం, మంచి ఆరోగ్యం కోసం కూష్మాండ దేవిని భక్తులు కొలుస్తారు. ప్రసిద్ధ కూష్మాండ దేవి ఆలయం కాన్పూర్ జిల్లాలోని ఘతంపూర్ పట్టణంలో ఉంది.
స్కందమాత, కాత్యాయని, కలరాత్రి, మహాగౌరి అమ్మవారు.. pic.twitter.com/r6bI4kZ1Il
— Vande bhaarath (@harithamithra1) September 30, 2024
5వ రోజు – స్కందమాత ఆలయం, వారణాసి
దుర్గాదేవి ఐదవ రూపం స్కంద మాత. స్కందమాత సింహ వాహనంపై నాలుగు చేతులతో దీదీప్యమానంగా వెలిగిపోతుంటుంది. రెండు చేతుల్లో కమలాలను ధరించి, ఒకచేత్తో అభయాన్నిస్తూ, మరో చేతితో కార్తికేయుడిని పట్టుకుని ఉంటుంది. స్కందమాతని పూజిస్తే జ్ఞానం, మోక్షం సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. పైగా ఈ అమ్మవారిన పూజిస్తే ఆమె ఒడిలో ఉన్న కార్తికేయుడు కూడా ప్రసన్నమవుతాడని చెబుతారు.
6వ రోజు – కాత్యాయని ఆలయం, కర్ణాటక
దుర్గాదేవి ఆరవ రూపం కాత్యాయనీ దేవి. హిందూ పురాణాల ప్రకారం, దుర్గా దేవికి సంబంధించిన రూపాల్లో కాత్యాయనీ అమ్మవారిది అత్యంత హింసాత్మక రూపాలలో ఒకటిగా పరిగణిస్తారు. మహిషాసురుడు అనే రాక్షసుడిని కాత్యాయని అమ్మవారే వధించారు. అందుకే ఈ అమ్మవారిని
కర్ణాటక అవెర్సాలోని కాత్యాయని బనేశ్వర్ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. కాత్యాయని దేవి దేవతల కోపం నుంచి పుట్టిందని నమ్ముతారు. ఢిల్లీ, కేరళ, బృందావన్, కొల్హాపూర్‌లలో కూడా ఈ కాత్యాయనీ దేవి ఆలయాలు ఉన్నాయి.
7వ రోజు – కలరాత్రి ఆలయం, వారణాసి
కాళరాత్రి లేదా రాత్రికి పాలకుడు. దుర్గదేవికి ఏడవ అవతారం.. వారణాసిలోని కల్రాత్రి ఆలయం ఇక్కడ అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటిగా ఉంది. ఇక్కడికి పెద్ద సంఖ్యలో భక్తులు దేవతను ఆరాధించడానికి వస్తారు. కాళీ, మహాకాళీ, భధ్రకాళీ, భైరవి, మృత్యు, రుద్రాణి, చాముండా, చండీ, దుర్గా వంటి అమ్మవారి అవతారాలలో ఈ కాళరాత్రీదేవి కూడా ఒకరు. నవరాత్రుల ఏడవ రోజు అయిన ఆశ్వీయుజ శుద్ధ సప్తమినాడు ఈ అమ్మవారిని పూజిస్తారు…
8వ రోజు – మహాగౌరి ఆలయం, లూథియానా
దుర్గాదేవి ఎనిమిదవ అవతారం మహాగౌరి.. తన చేతుల్లో త్రిశూలం, డోలు, కమలాన్ని పట్టుకుని ఉంటారు. పంజాబ్‌లోని లూథియానాలో ఉన్న మహాగౌరి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. నవరాత్రులలో ఎనిమిదవ రోజైన ఆశ్వీయుజ శుద్ధ అష్టమి రోజున ఈ అమ్మవారిని పూజిస్తారు. హిందూ పురాణాల ప్రకారం మహాగౌరీదేవిని పూజిస్తే అన్ని కోరికలనూ నెరవేరుస్తారని భక్తులు నమ్ముతారు.
9వ రోజు – సిద్ధిదాత్రి ఆలయం, సాగర్
Durga Navratri 2024 సిద్ధిదాత్రి అంటే జ్ఞానోదయాన్ని సూచింస్తుంది. ఇది దుర్గామాత తొమ్మిదవ అవతారం. ఈ అమ్మవారు దైవిక శక్తులను, జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని చెబతుఆరు. వారణాసి, దేవ్‌పహారిలో సిద్ధిదాత్రికి ఆలయాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని సాగర్ ప్రాంతంలో ఉన్న సిద్ధిదాత్రి అమ్మవారి అలయం ఎంతో ప్రసిద్ధి చెందింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
Om namah shivaya