DSC Results 2024 : డీఎస్సీ 2024 ఫలితాలను విడుదల చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరో శుభవార్త చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఖాళీలపై పరిశీలన చూసుకొని మరో డీఎస్సీ నిర్వహిస్తామని వెల్లడించారు. విద్యపై ఖర్చు విద్యపై పెట్టేది ఖర్చు కాదని పెట్టుబడి అని తాము భావిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యార్థుల సంఖ్యతో ప్రమేయం లేకుండా ప్రభుత్వ పాఠాశాలలు నిర్వహిస్తామని చెప్పారు. .
ప్రస్తుత డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇందులో ఉన్న మిగిలిపోయే ఖాళీలు, కొత్తగా ఏర్పడే ఖాళీలు సేకరించి డీఎస్సీపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇకపై ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు నియామకాలు చేపడతామని, త్వరలోనే గ్రూప్ 1 ఫలితాలు (Group 1 Results) కూడా వెల్లడిస్తమని తెలిపారు.
ఒక్కో నియోజక వర్గంలో రూ.100 -120 కోట్ల నిధులతో 20 నుంచి 25 ఎకరాల స్థలంలో సకల వసతులతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల క్యాంపస్ (Integrated Residential Schools) లను ఏర్పాటు చేస్తాం. అందులో భాగంగానే కొడంగల్, మధిరల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ మైనార్టీ విద్యార్థులను ఒకే చోట విద్యను అందించబోతున్నామని ఆయన తెలిపారు. యూనివర్శిటీ స్థాయిలో ఈ రెసిడెన్సియల్ స్కూల్స్ ఉంటాయని పేర్కొన్నారు..
బదిలీలు, ప్రమోషన్లు లేక నిరాశా నిస్పృహలతో ఉన్న టీచర్లకు సంబంధించి 34,706 మందికి ఎలాంటి అవాంతరాలు, ఆరోపణలు లేకుండా ఆ ప్రక్రియను చేశామన్నారు. విద్య, నీళ్లు, నియామకాలు వంటివి భావోద్వేగంతో కూడినవి. త్వరలోనే గ్రూప్ 1 ఫలితాలు ప్రకటిస్తామని, ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 60 నుంచి 65 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలన్నది తమ లక్ష్యమని తెలిపారు. గత జూలై 18 నుంచి ఆగస్టు 5 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 54 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన డీఎస్సీ ఫలితాలను (DSC Results 2024) 55 రోజుల రికార్డు సమయంలో ప్రకటించడంపై విద్యా శాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..