Sunday, October 13Latest Telugu News
Shadow

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు బంపర్ ఆఫర్లు..

Hyderabad metro train offers  | మెట్రో ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజలకు ప్రయాణీకుల అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు రెండు కీలక కార్యక్రమాలను హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. ఇప్పటికే జనాధరణ పొందిన కస్టమర్ ఆఫర్‌లను పొడిగించనున్నట్లు తెలిపింది. ప్రజల నుంచి వస్తోన్న డిమాండ్ ఆధారంగా బాగా పాపుల‌ర్ అయిన మూడు బంపర్ ఆఫర్లను మార్చి 31, 2025 వరకు పొడిగిస్తున్నట్లు మెట్రో యాజమాన్యం శుభ‌వార్త చెప్పింది. ఈ ఆఫర్‌ల‌తో ప్రయాణికులకు భారీగా డబ్బులు ఆదా అవుతుంద‌ని తెలిపింది.

READ MORE  New Beer | మద్యం ప్రియులకు కిక్కు ఇచ్చేందుకు కొత్త ‘బీర్లు’..

గడువు పొడిగించిన ఆఫర్లు ఇవే..

సూపర్ సేవర్ ఆఫర్-59  కింద కేవలం రూ.59 తో మెట్రో రైళ్ల‌లో అపరిమిత ప్రయాణాన్ని ఎల్ అండ్ టీ ఎంఆర్ హెచ్ఎల్ లిస్టెడ్ సెలవుల్లో వినియోగించుకోవ‌చ్చు. స్టూడెంట్ పాస్ ఆఫర్ ను  విద్యార్థులు 20 ట్రిప్పులు చెల్లించి 30 ట్రిప్పులు పొందే ఆఫర్..
సూపర్ సేవర్ ఆఫ్-పీక్ ఆఫర్: రద్దీ లేని సమయాల్లో ప్రయాణిస్తున్నప్పుడు కాంటాక్ట్‌లెస్ స్మార్ట్ కార్డ్‌లపై (సీఎస్‌సీలు) 10 శాతం తగ్గింపును ల‌భిస్తుంది. ఈ ఆఫ‌ర్ల‌ను పొడించడంతోపాటు ప్ర‌యాణికుల‌కు పార్కింగ్ సౌకర్యాలను కూడా అందుబాటులోకితీసుకురానుంది. అక్టోబర్ 6, 2024 నుంచి ఎల్ అండ్ టీ ఎంఆర్ హెచ్ఎల్ నాగోల్‌, మియాపూర్ మెట్రో స్టేషన్లలో పార్కింగ్ రుసుములను వసూలు చేయ‌నుంది. ఈ పార్కింగ్ స్థలాలు ప్రయాణీకుల భద్రతను పెంచుతుంద‌ని యాజమాన్యం తెలిపింది.

READ MORE  ప్ర‌యాణికుల‌కు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. హైద‌రాబాద్ శివార్ల‌లో..

మెట్రో స్టేష‌న్ల‌లో సౌక‌ర్యాలు

Hyderabad metro train offers ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ అందుబాటులోకి తీసుకువ‌చ్చారు.
ప్రయాణికుల కోసం బయో-టాయిలెట్లు, 24/7 భద్రత, సీసీటీవీ నిఘా, న‌గ‌దు లావాదేవీల కోసం యాప్/క్యూ ఆర్ పేమెంట్ సిస్టం, స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం సులభమైన పార్కింగ్, యాక్సెస్ కోసం లేన్ గుర్తింపు, మహిళలు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఉంటాయి. అలాగే స‌మీపంలోని హాస్పిట‌ళ్లు, పోలీస్ స్టేషన్, అగ్నిమాపక స్టేషన్ వంటి కీల‌క నెంబ‌ర్లు పొందుప‌ర‌చ‌నున్నారు.

READ MORE  Old City Metro Project : త్వ‌ర‌లో ఓల్డ్ ‌సిటీలో మెట్రో ప‌రుగులు.. మార‌నున్న రూపురేఖ‌లు

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్