Sunday, October 13Latest Telugu News
Shadow

ఆవు ఇకపై ‘రాజ్యమాత’.. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటన

ముంబై: గోమాతను ‘రాజ్యమాత’ (Rajya Mata) గా ప్రకటిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పురాతన కాలం నుంచి  గోవులకు ఉన్న పవిత్రత, ప్రాధాన్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర సర్కారు పేర్కొంది. భారతీయ సమాజంలో ఆధ్యాత్మిక, శాస్త్రీయ, చారిత్రికంగా ఆవు ప్రాముఖ్యతను ఇది తెలియజేస్తుందన్నారు. , ఆయుర్వేద, పంచగవ్య చికిత్సలు, సేంద్రియ వ్యవసాయంలో ఆవు ఎరువు ఉపయోగం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని ఆవును ‘రాజ్యమాత’గా ప్రకటించినట్లు పేర్కొన్నారు. మహారాష్ట్ర వ్యవసాయ, పాడిపరిశ్రమ అభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్యశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

READ MORE  PM Kisan Yojana | పీఎం కిసాన్ యోజన డబ్బులు రాబోతున్నాయి, అంతకంటే ముందే ఈ పని పూర్తి చేయండి

దేశీయ ఆవులు మన రైతులకు ఒక వరం. కాబట్టి, మేము గోవులకు ఈ (Cow As Rajya Mata) హోదా ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. గోశాలలో దేశవాళీ ఆవుల పెంపకం కోసం కూడా సహాయం చేయాలని నిర్ణయించుకున్నాము” అని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ తెలిపారు.  మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, దేశవాళీ ఆవుల పెంపకం కోసం రోజుకు రూ.50 సబ్సిడీ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. “ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Chief Minister Eknath Shinde) సమావేశానికి అధ్యక్షత వహించారు. గోశాలలకు ఆదాయం తక్కువగా ఉండడంతో ఆర్థిక స్థోమత లేకపోవడంతో వాటిని బలోపేతం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకాన్ని మహారాష్ట్ర గోసేవ కమిషన్ ఆన్‌లైన్‌లో అమలు చేస్తుంది”

READ MORE  Unified Pension Scheme | మోడీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. కొత్త ఏకీకృత పెన్షన్ పథకం ప్ర‌వేశ‌పెట్టిన కేంద్రం

“ప్రతి జిల్లాలో జిల్లా గోశాల పరిశీలన కమిటీ ఉంటుంది. 2019లో 20వ జంతు గణన ప్రకారం దేశవాళీ ఆవుల సంఖ్య 46,13,632 తక్కువగా ఉన్నట్లు తేలింది. 19వ జనాభా లెక్కలతో పోలిస్తే ఈ సంఖ్య 20.69 శాతం తగ్గింది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్