Special Buses for Dasara హైదరాబాద్ : దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) 6,000 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సులు అక్టోబరు 1 నుంచి 15 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని, వాటిలో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని తెలిపింది.
నగర కీలక ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులు
పండుగల సమయంలో ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రయాణికుల సమయాన్ని ఆదా చేసేందుకు హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది . MGBS , JBS, LB నగర్ , ఉప్పల్, ఆరామ్‌ఘర్, సంతోష్‌నగర్, KPHB, ఇతర ప్రాంతాల నుంచి వారి స్వస్థలాలకు వెళ్లాలనుకునే వారి కోసం ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచబడతాయి . ఐటీ కారిడార్ ఉద్యోగుల సౌకర్యార్థం గచ్చిబౌలి ఓఆర్‌ఆర్ మీదుగా విజయవాడ , బెంగళూరు తదితర ప్రాంతాలకు బస్సులు నడపాలని ఆర్టీసీ యోచిస్తోంది.
➡️హైదరాబాద్ శివారు నుంచి దసరాకు ప్రత్యేక బస్సులు
➡️ఓఆర్‌ఆర్ మీదుగా విజయవాడ, బెంగళూరుకు సర్వీసులు
➡️ దసరాకు టీజీఎస్ఆర్టీసీ 6 వేల ప్రత్యేక బస్సుల ఏర్పాటు
➡️ కరీంనగర్, నిజామాబాద్ మార్గాల్లో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు
➡️ ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా… pic.twitter.com/ifIDHqlqWv
— VC Sajjanar – MD TGSRTC (@tgsrtcmdoffice) September 30, 2024
సజ్జనార్ ఆదేశాలు..
దసరా ప్రత్యేక బస్సులు, రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై టీజీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ క్షేత్రస్థాయి అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. గత దసరాతో పోలిస్తే ఈసారి ‘ మహాలక్ష్మి పథకం’ అమలు చేయడం వల్ల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సజ్జనార్ తెలిపారు.
Special Buses for Dasara హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని అన్ని ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడిపించనున్నారు. అక్టోబర్ 12న దసరా ఉన్నందున 9, 10, 11వ తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, అవసరాన్ని బట్టి మరిన్ని ప్రత్యేక బస్సులు నడపాలని సూచించారు. ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో మాట్లాడి టోల్ ప్లాజాల వద్ద ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక లైన్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటాం’’ అని సజ్జనార్ తెలిపారు.
ఇదిలాఉండగా, ఈ ఏడాది కరీంనగర్, నిజామాబాద్ రూట్లలో ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు . ఇబ్బంది లేని ప్రయాణం కోసం పోలీసులు, రవాణా, మున్సిపల్ అధికారులతోనూ సమన్వయం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం www.tgsrtbus.inని సందర్శించండి లేదా 040-69440000 లేదా 040-23450033 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..