
Charlapalli Railway Terminal | దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని సికింద్రాబాద్, హైదరాబాద్ (నాంపల్లి), కాచిగూడ స్టేషన్లపై ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు భారతీయ రైల్వే కొత్తగా చర్లపల్లి రైల్వే టెర్మినల్, అలాగే లింగంపల్లి రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది. సికింద్రాబాద్ లో ప్రయాణికుల రద్దీ కారణంగా ప్లాట్ ఫారాలు ఖాళీలేకపోవడంతో రైల్వే స్టేషన్ బయటే గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సి వస్తోంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రతిరోజు సుమారు 200 రైళ్ల ద్వారా దాదాపు రెండు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.
ఈ మూడు స్టేషన్లపై ఉన్న భారం తగ్గించేందుకు ప్రత్యామ్నాయ రైల్వే జంక్షన్ గా చర్లపల్లిని అభివృద్ధి చేస్తున్నారు. సుమారు రూ.450 కోట్లతో టెర్మినల్ నిర్మాణ పనులు చేస్తున్నారు. ఇప్పటిరకు 95 శాతం పూర్తి కాగా, సెప్టెంబరు మొదటి వారంలో ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఇక్కడ తొమ్మిది ప్లాట్ ఫారాలు అందుబాటులోకి వచ్చాయి.
ప్రతిరోజు 50 రైళ్లను చర్లపల్లి (Cherlapalli Railway Station ) నుంచి నడిపించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రారంభంలో 25 రైళ్లను నడిపించనున్నారు. క్రమంగా దశలావారీగా 50 రైళ్లకు పెంచనున్తానారు. మరోవైపు చర్లపల్లికి చేరుకునేందుకు మౌలాలి-సనత్ నగర్ మార్గం కూడా పూర్తయింది. మేడ్చల్, మల్కాజిగిరి, ఫలక్ నుమా, లింగంపల్లి ప్రాంతాల ప్రజలు ఎంఎంటీఎస్ ద్వారా చర్లపల్లి స్టేషన్ కు చేరుకోవచ్చు. ఆయా ప్రాంతాల ప్రజలు రోడ్డు మార్గం ద్వారా చర్లపల్లిని చేరుకునేందుకు కొన్ని రహదారులను కూడా విస్తరిస్తున్నారు. దీనివల్ల ఆర్టీసీ బస్సుల ద్వారా కూడా చర్లపల్లి స్టేషన్ చేరుకోవచ్చు. పలు రైళ్లు లింగంపల్లి నుంచి మౌలాలి మీదుగా చర్లపల్లికి రాకపోకలు సాగించనున్నాయి.
చర్లపల్లి నుంచి నడిచే రైళ్ల ఇవీ..
- కృష్ణా ఎక్స్ ప్రెస్, శాతావాహన
- గుంటూరు – సికింద్రాబాద్ ఇంటర్ సిటీ,
- గోల్కొండ ఎక్స్ ప్రెస్
- బీదర్-మచిలీపట్నం సూపర్ ఫాస్ట్,
- ముంబయి-భువనేశ్వర్ కోణార్క్,
- కాకినాడ-షిరిడీ ట్రైవీక్లీ,
- కాజీపేట-పూణె ట్రైవీక్లీ,
- కాకినాడ-లింగంపల్లి గౌతమి సూపర్ ఫాస్ట్,
- మచిలీపట్నం-షిరిడీ వీక్లీ ఎక్స్ ప్రెస్,
- టాటానగర్-యశ్వంత్ పూర్ వీక్లీ,
- లింగంపల్లి-కాకినాడ కోకనాడ ట్రైవీక్లీ,
- హైదరాబాద్-చెన్నై,
- షాలిమార్-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్,
- గోరఖ్‌పూర్-యశ్వంత్‌పూర్ వీక్లీ సూపర్ ఫాస్ట్,
- జమ్ముతావి-తిరుపతి హమ్‌సఫర్ వీక్లీ,
- నిజాముద్దీన్ – బెంగళూరు సిటీ రాజధాని సూపర్ ఫాస్ట్ రైలు
రైళ్లను చర్లపల్లి (Charlapalli Railway Terminal) నుంచి నడిపించనున్న రైళ్ల జాబితాను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. లింగంపల్లి నుంచి బయలుదేరే కొన్ని రైళ్లు సికింద్రాబాద్ వెళ్లే అవసరం లేకుండా మౌలాలి మీదుగా చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు చేరుకుంటాయి.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..