Charlapalli Railway Terminal | సికింద్రాబాద్ వెళ్లకుండానే త్వరలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచే పలు రైళ్ల రాకపోకలు
Charlapalli Railway Terminal | దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని సికింద్రాబాద్, హైదరాబాద్ (నాంపల్లి), కాచిగూడ స్టేషన్లపై ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు భారతీయ రైల్వే కొత్తగా చర్లపల్లి రైల్వే టెర్మినల్, అలాగే లింగంపల్లి రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది. సికింద్రాబాద్ లో ప్రయాణికుల రద్దీ కారణంగా ప్లాట్ ఫారాలు ఖాళీలేకపోవడంతో రైల్వే స్టేషన్ బయటే గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సి వస్తోంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రతిరోజు సుమారు 200 రైళ్ల ద్వారా దాదాపు రెండు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.ఈ మూడు స్టేషన్లపై ఉన్న భారం తగ్గించేందుకు ప్రత్యామ్నాయ రైల్వే జంక్షన్ గా చర్లపల్లిని అభివృద్ధి చేస్తున్నారు. సుమారు రూ.450 కోట్లతో టెర్మినల్ నిర్మాణ పనులు చేస్తున్నారు. ఇప్పటిరకు 95 శాతం పూర్తి కాగా, సెప్టెంబరు మొదటి వారంలో ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నా...