Wednesday, July 2Welcome to Vandebhaarath

కూల్చేసిన వందేళ్ల నాటి వృక్షానికి మళ్లీ జీవం పోశారు..

Spread the love

యాదాద్రి భువనగిరి జిల్లా వాసి కృషి

తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఈ ఏడాది ప్రారంభంలో భూమి ప్లాట్లు కోసం కొంతమంది రియల్టర్ల చేతిలో నరికివేయబడిన 100 ఏళ్ల మర్రి చెట్టుకు మళ్లీ ప్రాణం పోశారు ఈ ప్రకృతి ప్రేమికులు. దాదాపు 10 అడుగుల వ్యాసం కలిగిన 20 టన్నులకు పైగా బరువున్న మర్రి చెట్టును క్రేన్‌ల సాయంతో పైకి లేపి ఓ ప్రైవేట్‌ స్థలంలోకి తరలించారు. భారీ మల్టీ యాక్సిల్‌ ట్రక్కుపై 54 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి జాగ్రత్తగా  చెట్టును మళ్లీ నాటారు. ఇప్పుడది కొ్త్తకొమ్మలు, చిగుటాకులతో పచ్చగా కళకళలాడుతోంది.

చెట్టు జీవం పోసిన ప్రకృతి ప్రేమికుడు అనిల్  గోదావర్తి మాట్లాడుతూ.. “మే 30న మేడ్చల్ మల్కాజ్‌గిరిలోని ఘట్‌కేసర్‌ సమీపంలోని ఘన్‌పూర్‌కి వెళ్లే దారిలో రోడ్డు పక్కన మర్రిచెట్టు (Banyan Tree) పడి ఉండడం గమనించాను. దాన్నిచూసిన వెంటనే ఆ చెట్టును నా స్థలంలోకి తీసుకురావడానికి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను. గతంతో ఇలా నరికేసిన భారీ వృక్షాలను తిరిగి నాటడాన్ని చూశాను. నేను నా స్నేహితులను సంప్రదించి దానిని తరలించే అవకాశం గురించి చర్చించాను, ”అని Anil Godavarthi చెప్పారు.

తన స్నేహితుల సలహా మేరకు అమెజాన్ ప్రాజెక్ట్ మేనేజర్ తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ చీఫ్ కోఆర్డినేటర్ ఆఫీసర్‌ను సంప్రదించి.. చెట్టును ఎలా కాపాడాలనే దానిపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ)లోని చెట్ల పెంపకం విభాగంతోనూ ఆయన మాట్లాడారు. నిపుణుల ఇన్‌పుట్‌ల ఆధారంగా, యువకుల బృందం మర్రి చెట్టు కోసం రెస్క్యూ ప్లాన్‌ను సిద్ధం చేసింది.

చెట్టును బతికించేందుకు జాగ్రత్తలు

“చెట్టుకు చెందిన మొత్తం మూల వ్యవస్థ మట్టితో పాటు చెక్కుచెదరకుండా ఉంది. ప్రధాన  చెట్టు కాండంలోని పైన మొక్కలన్నీ కత్తించి ఉన్నాయి. వెంటనే గోనె సంచులు, తాటాకులతో వేర్లను కప్పి నీళ్లు పోయడం మొదలుపెట్టాం’’ అని అనిల్ చెప్పారు.

స్టేషన్‌ఘన్‌పూర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలోని నర్సరీ నుంచి నీటిని తెచ్చుకునేందుకు 100 మీటర్ల నీటి పైపును ఉపయోగించారు. చెట్టు వేర్లకు క్రమం తప్పకుండా నీరు పోశారు. దాదాపు రెండు వారాల తర్వాత, చెట్టు ఆకులు మొలకెత్తడం ప్రారంభించింది. దీంతో చెట్టు బతుకుతుందనే నమ్మకం వారికి కలిగింది.

ఆ తర్వాత దానిని యాదాద్రి భువనగిరి జిల్లాలోని నా స్వంత గ్రామం మోటంకొండూర్‌కు  మార్చాలని నిర్ణయించుకున్నారు అనిల్ గోదార్తి. – సుమారు 54 కిలోమీటర్ల దూరంలో అతనికి ఒక ఎకరం భూమి ఉంది. అక్కడికి తరలించాలని నిర్ణయించుకున్నారు. “మేము చెట్టును చాలా దూరం వరకు మార్చడానికి ఒక మార్గం కోసం అన్వేషించారు.
“HMDA అధికారులు మాకు హెల్ప్ చేశారు. మాకు సహాయం చేయడానికి ఒక కాంట్రాక్టర్‌ను పంపారు.” అని అనిల్ చెప్పాడు, చెట్టు సుమారు 100 సంవత్సరాల వయస్సు ఉన్నట్లు కనిపిస్తుందని కాంట్రాక్టర్ పేర్కొన్నారు.

Read Also : పెరట్లో ఈ మొక్కలు ఉంటే చాలు.. పాములు దగ్గరికి కూడా రావు..!

జూన్ మూడో వారంలో చెట్టును మోటంకొండూరుకు తరలించేందుకు కసరత్తు మొదలైంది. అనిల్ గోదావర్తి, అతని స్నేహితులు 40 టన్నుల మర్రి చెట్టును ఎత్తి ట్రక్కులో ఉంచడానికి 12 టన్నుల సామర్థ్యం గల నాలుగు క్రేన్‌లను మోహరించారు. “మేము 24 గంటల్లో గ్రామంలోని నా భూమికి చెట్టును జాగ్రత్తగా తీసుకువెళ్ళాము,” అని చెప్పారు
అనిల్ గోదావర్తి. తన భూమిలో మర్రిచెట్టును నాటేందుకు ఎనిమిది అడుగుల లోతున కందకాన్ని తవ్వించారు. మరో మూడు భారీ క్రేన్‌లను మోహరించి.. ఎర్త్ మూవర్ సహాయంతో దానిని జాగ్రత్తగా కందకంలో ఉంచామని, తర్వాత గోమూత్రం, మట్టితో నింపామని తెలిపారు. చెట్టును విజయవంతంగా తరలించడానికి సహాయం అందించిన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. “మొత్తం ప్రక్రయకు సుమారు రూ. 90,000 ఖర్చు అయింది.
కానీ  ఈ వృక్షం అంతకన్నా విలువైనది. మర్రి చెట్టు ఇప్పుడు కొత్త కొమ్మలు, ఆకులతో కళకళలాడుతోంది. ఇది మరెన్నో దశాబ్దాల వరకు మనుగడ సాగిస్తుందని అని అనిల్ తెలిపారు. కాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్.. అనిల్ గోదావర్తి కృషిని అభినందించారు.

 

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..