ఆవు ఇకపై ‘రాజ్యమాత’.. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటన
ముంబై: గోమాతను ‘రాజ్యమాత’ (Rajya Mata) గా ప్రకటిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పురాతన కాలం నుంచి గోవులకు ఉన్న పవిత్రత, ప్రాధాన్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర సర్కారు పేర్కొంది. భారతీయ సమాజంలో ఆధ్యాత్మిక, శాస్త్రీయ, చారిత్రికంగా ఆవు ప్రాముఖ్యతను ఇది తెలియజేస్తుందన్నారు. , ఆయుర్వేద, పంచగవ్య చికిత్సలు, సేంద్రియ వ్యవసాయంలో ఆవు ఎరువు ఉపయోగం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని ఆవును ‘రాజ్యమాత’గా ప్రకటించినట్లు పేర్కొన్నారు. మహారాష్ట్ర వ్యవసాయ, పాడిపరిశ్రమ అభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్యశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.దేశీయ ఆవులు మన రైతులకు ఒక వరం. కాబట్టి, మేము గోవులకు ఈ (Cow As Rajya Mata) హోదా ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. గోశాలలో దేశవాళీ ఆవుల పెంపకం కోసం కూడా సహాయం చేయాలని నిర్ణయించుకున్...