PM Kisan Status Check | 9.2 కోట్ల మంది రైతులకు రూ. 20,000 కోట్లు పంపిణీ చేసిన ప్రధాని మోదీ.. ఎలా చెక్ చేసుకోవాలి?
PM Kisan Status Check | దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తొలిసారి వారణాసిలో పర్యటించారు. టెంపుల్ సిటీలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 17వ విడత నిధులను విడుదల చేశారు. అలాగే కృషి సఖీలకు ప్రధాని ఈ సందర్భంగా సర్టిఫికెట్లు అందజేశారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 20,000 కోట్లు జమ చేశారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకూ కోట్లాది మంది రైతుల బ్యాంక్ ఖాతాలకు రూ. 3.24 లక్షల కోట్లు బదిలీ చేశారని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.
కాగా ఈ పథకం కింద ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000 చొప్పున సంవత్సరానికి రూ. 6,000 రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు 16 విడతలు విడుదల చేసింది. ”రైతు సంక్షేమానికి మా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంతకం చేసిన మొదటి ఫైలు పీఎం కిసాన్ కు సంబంధించినదే.. రైతులు, వ్యవసాయ రంగ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని ప్రధాని మోదీ చెప్పారు.
ఆన్‌లైన్‌లో ఎలా తనిఖీ చేయాలి?
PM Kisan Status Check : రైతులు తమ PM-KISAN లబ్ధిదారుల స్థితిని ఆన్‌లైన్‌లో తనిఖీ చేయవచ్చు:
- pmkisan.gov.in వద్ద అధికారిక PM-KISAN వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- ‘ఫార్మర్స్ కార్నర్ (Farmers Corner) విభాగానికి నావిగేట్ చేసి, ‘బెనిఫిషియరీ స్టేటస్ (Beneficiary Status) పై క్లిక్ చేయండి.
- మీ ఆధార్ లేదా రిజిస్టర్డ్ బ్యాంక్ ఖాతా నంబర్ వివరాలను నమోదు చేసి, ‘Get Data’ పై క్లిక్ చేయండి. మీ స్టేటస్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
- e-KYC ఫార్మాలిటీలను పూర్తి చేయండి.
- పీఎం కిసాన్ పథకం కింద ఆర్థిక సహాయం పొందడానికి, e-KYCని పూర్తి చేయడం తప్పనిసరి. రైతులు బయోమెట్రిక్ ఆధారిత ఇ-కెవైసి లేదా ఒటిపి ఆధారిత ఇ-కెవైసిని ఎంచుకోవచ్చు.
e-KYC కోసం ఇలా చేయండి..
- https://pmkisan.gov.in/ సందర్శించండి
- ‘Farmers Corner’లో, e-KYC ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
- మీ ఆధార్ వివరాలు, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
- ధృవీకరణ కోసం మీ మొబైల్‌కి OTP వస్తుంది.
- e-KYC ప్రక్రియను పూర్తి చేయడానికి OTPని నమోదు చేయండి.
- బయోమెట్రిక్ ఆధారిత e-KYC కోసం, సాధారణ సేవా కేంద్రాలు (CSC) లేదా రాష్ట్ర సేవా కేంద్రాన్ని సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..