
PM Kisan Status Check | 9.2 కోట్ల మంది రైతులకు రూ. 20,000 కోట్లు పంపిణీ చేసిన ప్రధాని మోదీ.. ఎలా చెక్ చేసుకోవాలి?
PM Kisan Status Check | దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తొలిసారి వారణాసిలో పర్యటించారు. టెంపుల్ సిటీలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 17వ విడత నిధులను విడుదల చేశారు. అలాగే కృషి సఖీలకు ప్రధాని ఈ సందర్భంగా సర్టిఫికెట్లు అందజేశారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 20,000 కోట్లు జమ చేశారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకూ కోట్లాది మంది రైతుల బ్యాంక్ ఖాతాలకు రూ. 3.24 లక్షల కోట్లు బదిలీ చేశారని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.కాగా ఈ పథకం కింద ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000 చొప్పున సంవత్సరానికి రూ. 6,000 రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు 16 విడతలు విడుదల చేసింది. ''రైతు సం...