Home » Kisan Credit Cards : పావలా వడ్డీకే రుణాలు అందించే కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ గురించి మీకు తెలుసా? పూర్తి వివరాలు ఇవే..
Kisan Credit Card Details in Telugu

Kisan Credit Cards : పావలా వడ్డీకే రుణాలు అందించే కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ గురించి మీకు తెలుసా? పూర్తి వివరాలు ఇవే..

Spread the love

Kisan Credit Card Details: బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులతో పోలిస్తే, కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు (KCC) కాస్త భిన్నవైనవి. కేవలం రైతుల కోసం మాత్రమే ఉద్దేశించిన రుణ పథకం ఇది. వ్యవసాయ రంగం, రైతులకు అవసరమైన షార్ట్‌ టర్మ్‌ రుణాల కోసం, 1998లో నాబార్డ్‌ (NABARD) ఈ క్రెడిట్‌ కార్డులను ప్రవేశపెట్టింది. వీటిని ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంక్ లు, కోపరేటివ్‌ బ్యాంక్ లు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ లు అందిస్తాయి.
ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు (Pradhan Mantri Kisan Samman Nidhi Yojana) లింక్ చేశారు.. కాబట్టి ఆ కార్డులను PM కిసాన్ క్రెడిట్ కార్డ్ లు అని కూడా పిలుస్తారు.
కేసీసీల్లో కొంత రుణ పరిమితి (KCC Credit Limit) ఉంటుంది. ఆ మొత్తంతోనే వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేయడం పాటు, ఇతర ఖర్చుల కోసం ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా, కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్ తో కేవలం పావలా వడ్డీతో (4%) రైతులకు రూ.3లక్షల వరకు అప్పు దొరుకుతుంది.

న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి

కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యవసాయం చేసే రైతులు దీని కోసం అప్లై చేసుకోవచ్చు. రైతులతో పాటు మత్స్య పెంపకం, పాడి రైతులకు కూడా కేసీసీలను మంజూరు చేస్తారు, వారి పెట్టుబడి అవసరాలన్నీ తీరేలా చూస్తారు.

READ MORE  Model Code of Conduct | మోడల్ ఆఫ్ కండక్ట్ అంటే ఏమిటీ..

కిసాన్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు ఇవే.. (Benefits of Kisan Credit Card)

  • వ్యవసాయం, అనుబంధ పనులు, పంటకోతల తర్వాత ఖర్చుల కోసం రైతులకు రుణం లభిస్తుంది.
  • పాడి పశువులు, పంపుసెట్లు ఇతర వ్యవసాయ అవసరాలకు పెట్టుబడి వస్తుంది.
  •  రైతులు గరిష్టంగా రూ.3లక్షల వరకు రుణం తీసుకోవచ్చు
  • వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ కోసం సైతం రుణాలు తీసుకోవచ్చు.
  • కార్డుదారులకు శాశ్వత వైకల్యం లేదా మరణం సంభవిస్తే బీమా కవరేజీ రూ.50 వేల వరకు ఉంటుంది. ఇతర ప్రమాదాల విషయంలో రూ.25,000 వరకు చెల్లిస్తారు.
  • అర్హులైన రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ తో పాటు స్మార్ట్ కార్డ్, డెబిట్ కార్డ్‌, సేవింగ్స్‌ అకౌంట్‌ కూడా లభిస్తుంది..
  • రైతులకు ఇబ్బంది లేకుండా రుణాన్ని తిరిగి చెల్లించుకునే ఆప్షన్లు ఉంటాయి.
  • అన్ని వ్యవసాయ మరియు అనుబంధ అవసరాల కోసం ఒకే క్రెడిట్ ఫెసిలిటీ లేదా టర్మ్ లోన్ దొరుకుతుంది.
  • ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు నగదు రాయితీ
  • మూడేళ్లకు వరకు క్రెడిట్ లభిస్తుంది. పంట చేతికి వచ్చిన తర్వాత తిరిగి చెల్లించుకోవచ్చు
  • రూ.1.60 లక్షల వరకు రుణానికి షూరిటీ అవసరం లేదు.
READ MORE  Krishna Janmashtami 2023 : శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే ఏంటి ? పండుగ విశిష్టత ...

కిసాన్ క్రెడిట్ కార్డులపై వడ్డీ, ఇతర ఛార్జీలు

(Interest and Other Charges on Kisan Credit Cards) కిసాన్ క్రెడిట్ కార్డ్ లను చాలా బ్యాంక్ లు జారీ చేస్తున్నాయి.
దీంతో.. Kisan Credit Cards క్రెడిట్ లిమిట్‌, వడ్డీ రేటు ఒక్కో బ్యాంకుకు ఒక్కో విధంగా ఉంటుంది. సగటున KCC వడ్డీ రేట్లు 2 శాతం నుంచి 4 శాతం వరకు ( KCC interest rate) ఉంటాయి.. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా చేసే కొనుగోళ్లు, తిరిగి చెల్లింపుల (క్రెడిట్‌ హిస్టరీ) ఆధారంగా, రైతులకు కేంద్ర ప్రభుత్వం చాలా ప్రోత్సాహకాలను అందిస్తుంది.
ఇక KCC ఛార్జీల విషయానికి వస్తే… ప్రాసెసింగ్ ఖర్చులు, బీమా ప్రీమియం, ఇతర ఛార్జీలు అన్నీ కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ జారీ చేసే బ్యాంకులు నిర్ణయిస్తాయి. నిర్ణయిస్తుంది.

READ MORE  సేఫ్టీ టెస్ట్ లో ప్రముఖ కంపెనీల కార్లకు చెత్త ర్యాంకులు 

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..