Surat Bulldozer action | సూరత్ లోనూ బుల్ డోజర్ యాక్షన్.. అక్రమ కట్టడాల నేలమట్టం..!
Surat Bulldozer action | సూరత్‌లోని వినాయక మండపంపై కొందరు దుండగులు రువ్విన ఘటనలో ఆగ్రహానికి గురైన అనేక హిందువులు, హిందూ సంస్థలు.. అరెస్టు చేసిన నిందితులపై బుల్‌డోజర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నివేదికల ప్రకారం, గుజరాత్‌లోని సూరత్‌లోని పోలీస్ స్టేషన్ వద్ద అనేక మంది హిందూ సంస్థ సభ్యులు గుమిగూడి, యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశంసిస్తూ నినాదాలు చేశారు. పలు కేసుల్లో యోగి ఆదిత్యనాథ్ ఆదేశించిన విధంగానే నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.దీని ఫలితంగా, సూరత్‌లోని సయ్యద్‌పురా ప్రాంతంలో స్థానిక యంత్రాంగం ఈ కేసులో అరెస్టయిన నిందితుల అక్రమ ఆస్తులను బుల్డోజర్‌తో ధ్వంసం చేయడం ప్రారంభించింది. బుల్డోజర్ చర్యకు సంబంధించిన వీడియోలు ఇప్పడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి, ప్రజలు కూడా గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీని ప్రశంసించారు.సెప్టెంబరు 7, 8 తేదీల్ల...