Bulldozer Action | మైనర్ బాలికపై రేప్ కేసులో నిందితుడి బేకరీని కూల్చేసిన ప్రభుత్వం.. Video
Bulldozer Action | మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ నేత మొయీద్ ఖాన్‌పై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుల్డోజర్ చర్య చేపట్టింది. ఆయోధ్యలో నిందితుడి బేకరీని జేసీబీలతో నేలమట్టం చేయించింది. అయితే విచారణలో అతడు స్థలాన్ని కబ్జా చేసి బేకరి నిర్వహిస్తున్నట్లు తేలింది. దీంతో యూపీ సర్కారు ఆ బేకరీని కూల్చివేయాలని ఆదేశించగా అధికారులు వెంటనే అమలు చేశారు.ఈ ఘటనపై యూపీ మంత్రి, నిషాద్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ నిషాద్ స్పందించారు. అయోధ్యలో తాము గెలిచామని అఖిలేష్ యాదవ్ గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ మొయీద్ ఖాన్ వంటి నేరగాళ్ల సాయంతో వాళ్లు గెలిచారని విమర్శించారు. ఇలాంటి కరడుగట్టిన నేరగాళ్లను పార్టీ నుంచి బహిష్కరించడానికి బదులుగా సమాజ్‌వాది పార్టీ వారిని కాపాడుకుంటోందని అన్నారు. క్రిమినల్స్‌కి వ్యతిరేకంగా సమాజ్‌వాదీ పార్టీ కనీసం ఒక్క మాట కూడా మా...