Ayodhya Gangrape Case : కొనసాగుతున్న బుల్డోచర్ చర్య.. నిందితుడి షాపింగ్ కాంప్లెక్స్ కూల్చివేత
Ayodhya Gangrape Case | లక్నో: అత్యాచార నిందితుడైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నాయకుడు మోయిద్ ఖాన్‌కు చెందిన అక్రమంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌ను అయోధ్య జిల్లా యంత్రాంగం నేలమట్టం చేసింది. 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సుమారు రూ.3 కోట్ల విలువైన భవనాన్ని కూల్చేందుకు మూడు బుల్‌డోజర్లు (bulldozers), ఎక్స్‌కవేటర్‌ను ఉపయోగించారు. భారీ భద్రత నడుమ కూల్చివేతలు జరిగాయి.అయోధ్యలో 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో మోయిద్ ఖాన్ (65)ను అతని అసిస్టెంట్ రాజు ఖాన్‌తో పాటు జూలై 30న అరెస్టు చేశారు. అంతేకాకుండా, మైనర్ గ్యాంగ్‌రేప్ కు గురైన బాధితురాలు ఆగస్టు 7న లక్నోలోని ఓ హాస్పిటల్‌లో మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MTP) ప్రక్రియ చేయించుకోవాల్సి వచ్చింది. ఈ కేసులో అరెస్టయిన తర్వాత, ప్రధాన నిందితుడు మొయిద్ ఖాన్ మరొక అక్రమ నిర్మాణమైన 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న బేక...