Chhatarpur Bulldozer Action | ఛతర్‌పూర్ పోలీసులపై రాళ్లతో దాడి చేసిన ప్రధాన నిందితుడి ఇంటిపై బుల్డోజర్ యాక్షన్
Chhatarpur Bulldozer Action | భోపాల్: మహ్మద్ ప్రవక్త ఇస్లాం గురించి అభ్యంతరకరమైన ప్రకటనలు చేసినందుకు నిరసనగా ఆందోళనకారులు మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ ( జిల్లాలో ఒక పోలీసు స్టేషన్‌పై దాడి చేయగా అనేక మంది పోలీసు సిబ్బంది ఒక మహిళా జర్నలిస్ట్ గాయపడ్డారు. దీంతో నిరసనకు నాయకత్వం వహించిన నిందితుడి ఇఒంటిని గురువారం అధికారులు బుల్డోజర్ (Bulldozer Action ) చేశారు.ఛతర్‌పూర్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో హింసకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఛతర్‌పూర్ జిల్లా -పోలీసులకు సూచించిన కొద్ది గంటలకే వారు రంగంలోకి దిగారు. ప్రధాన నిందితులలో ఒకరైన హాజీ షాజాద్ అలీ నిర్మించిన రాజభవన గృహాన్ని బుల్డోజర్ తో కూల్చివేశారు. భోపాల్ నుంచి 342 కిమీ దూరంలో ఉన్న ఛతర్‌పూర్‌లో నిందితుడు అనుమతి లేకుండా భారీ ఇంటిని నిర్మించాడు.
అసలేం జరిగింది.
ఛతర్‌పూర్ జిల్లా కాంగ్...