Home » Lok Sabha elections 2024: వారణాసిలో ప్రధాని మోదీపై పోటీ చేస్తున్నహాస్యనటుడు శ్యామ్ రంగీలా ఎవరు?
Shyam Rangeela

Lok Sabha elections 2024: వారణాసిలో ప్రధాని మోదీపై పోటీ చేస్తున్నహాస్యనటుడు శ్యామ్ రంగీలా ఎవరు?

Spread the love

Shyam Rangeela | ప్రధాని నరేంద్ర మోదీని అనుకరిస్తూ వీడియోలు చేసి పాపుల‌ర్ అయిన హాస్యనటుడు శ్యామ్ రంగీలా 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానిపై వారణాసి స్థానం నుంచి పోటీ చేస్తానని వెల్ల‌డించారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గానికి జూన్ 1న లోక్‌సభ ఎన్నికల్లో ఏడవ దశలో ఓటింగ్ జరగనుంది. ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి. రంగీలా లోక్‌సభ 2024కి వారణాసి నుంచి పోటీ చేయ‌నున్న‌ట్లు బుధవారం సోషల్ మీడియాలో ప్రకటించారు . కాగా 2014, 2019లో రెండుసార్లు ఈ సీటును గెలుచుకున్న మోదీ , మే 13న వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు.

శ్యామ్ రంగీలా ఎవరు?

రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో పుట్టి పెరిగిన రంగీలా (Shyam Rangeela) యానిమేషన్ కోర్సు పూర్తిచేశారు. రంగీలా తన మిమిక్రీ తో బాగా పాల‌పుల‌ర్ అయ్యారు. ముఖ్యంగా రాజకీయ ప్రముఖులను మిమిక్రీ చేస్తూ . ‘ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’లో తన ప్రదర్శనలతో కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇరవై తొమ్మిదేళ్ల శ్యాం రంగీలా 2017లో తొలిసారిగా వెలుగులోకి వ‌చ్చాడు. అతను మోదీగా నటించడం సోషల్ మీడియాలో వైర‌ల్ అయింది. అప్పటి నుంచి రంగీలా పీఎం ప్రసంగాలు, ఇంటర్వ్యూలను అనుకరిస్తూ వీడియోలు చేస్తున్నారు. మోడీతో పాటు, రాహుల్ గాంధీ వంటి ఇతర రాజకీయ ప్రముఖులను కూడా శ్యామ్‌ అనుకరించారు. రంగీలా మోదీపై, ఆయన విధానాలపై విమర్శలు చేశారు.

READ MORE  Fourth Phase Election | నాలుగో విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 21% మందిపై క్రిమినల్ కేసులు.. ADR నివేదికలో సంచ‌లన‌ విష‌యాలు..

ఒకప్పుడు మోదీ ‘అభిమాని’

రంగీలా మొదట 2002లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)లో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అయితే, తర్వాత, “అతను తన స్వంత గురువు” అని చెప్పి స్వతంత్రంగా పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. ఒక ఇంటర్వ్యూలో, రంగీలా తన కామెడీ స్క్రిప్ట్ ల‌పై విధించిన ఆంక్షలను ఒక మలుపుగా పేర్కొంటూ, PM మోడీని విమ‌ర్శిచండం ప్రారంభిచాడు. తాను 2016-17 వరకు కూడా మోదీ భక్తుడిని (అభిమాని)గా ఉన్నానని కానీ నాపై ఆంక్షలు విధించార‌ని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్యాం రంగీలా చెప్పాడు.

READ MORE  Muslims reservations | నేను ముస్లిం వ్యతిరేకిని కాదు.. ముస్లిం రిజర్వేషన్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
IRCTC Economy Meals | రైల్వే ప్రయాణీకులకు అతిత‌క్కువ ధ‌ర‌లో భోజనం, స్నాక్స్.. పూర్తి వివరాలు ఇవే..

వార‌ణాసిలో ఇతర అభ్యర్థులు

వారణాసి స్థానానికి మోదీ బ‌రిలో దిగ‌డం దాదాపుగా ఖ‌రారైంది. కాంగ్రెస్ తన ఉత్తరప్రదేశ్ యూనిట్ చీఫ్ అజయ్ రాయ్‌ను వారణాసి నుంచి పోటీకి దింపింది . 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్ మూడో స్థానంలో నిలిచారు. కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి స్థానం నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు.ఈసారి ఇతర అభ్యర్థులలో, ట్రాన్స్‌జెండర్ మహామండలేశ్వర్ హేమాంగి సఖీ కూడా పోటీ చేస్తున్నారు.

READ MORE  YS Jagan | వక్ఫ్‌ బిల్లుపై క్లారిటీ ఇచ్చిన వైఎస్‌ జగన్‌

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..