IRCTC Economy Meals | రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. జనరల్ క్లాస్ కోచ్‌లలో ప్రయాణించేవారికి అతితక్కువ ధరలకు పరిశుభ్రమైన భోజనం, స్నాక్స్ (Economy Khana ) అందించే ఐఆర్సీటీసీ తన ప్రాజెక్టును మరిన్ని రైల్వేస్టేషన్లకు విస్తరించింది. రైళ్లు, స్టేషన్లలో ప్రయాణీకులకు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ‘ఎకానమీ ఖానా’ అందిస్తున్నామని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. ఆహార పదార్థాల, నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను పర్యవేక్షించేందుకు తాము నిరంతరం నిఘా పెడతామని వారు తెలిపారు.
ఈ చొరవ ఎందుకు తీసుకున్నారు?
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త కార్యక్రమాన్ని చేపడుతున్నారు. IRCTC అధికారి మాట్లాడుతూ, “మేము వేసవి కాలంలో ప్రయాణీకుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నామని అన్‌రిజర్వ్‌డ్ కంపార్ట్‌మెంట్లలో ప్రయాణించే వారు ఎదుర్కొంటున్న సమస్యలను మేం అర్థం చేసుకున్నామని తెలిపారు. వారికి ఎల్లప్పుడూ పాకెట్- ఫ్రెండ్లీ మీల్స్, టిఫిన్స్, స్నాక్స్ ను అందుబాటులో ఉండాలని అనుకుంటున్నామనితెలిపారు.
కౌంటర్లలో ఏమున్నాయి..?
IRCTC Economy Meals : ఎకానమీ మీల్స్, స్నాక్ మీల్స్. రైలులో ప్రయాణంలో ఉన్న ప్రయాణీకులకు ఎకానమీ మీల్స్ సంతృప్తికరమైన ఎంపికలను అందిస్తాయి, అయితే స్నాక్, మీల్స్ తేలికపాటి భోజనం అవసరమైన వారికి రూ. 20 నుంచి రూ. 50 ధరల్లో అందుబాటులో ఉన్నాయి. .
దీనిపై మరో అధికారి మాట్లాడుతూ, ఎనానమీ మీల్స్ కోసం ప్లాట్‌ఫారమ్‌లలోని అన్‌రిజర్వ్డ్ కంపార్ట్‌మెంట్‌ల వద్ద ఉండే కౌంటర్‌లలో అందుబాటులో ఉంటుందని, ఈ కౌంటర్లలో భోజనం, టిఫిన్స్, నీరు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు.
SCR | విశాఖపట్నం నుంచి ప్రత్యేక రైలు.. రైలు షెడ్యూల్, హాల్టింగ్ వివరాలు ఇవే..
ఏయే స్టేషన్లలో అందుబాటులో ఉన్నాయి?
గతేడాది 51 రైల్వే స్టేషన్లలో ఈ సేవ అందుబాటులోకి వచ్చింది. ఇది విజయవంతమైన తర్వాత, ఇది ఇప్పుడు 1oo రైల్వే స్టేషన్లకు విస్తరించింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, రేణిగుంట, గుంతకల్, తిరుపతి, రాజమండ్రి, వికారాబాద్, పాకాల, ధోనే, నంద్యాల, పూర్ణ, ఔరంగాబాద్ వంటి కొన్ని ప్రముఖ స్టేషన్లు ఈ ప్రాజెక్టు పరిధిలోకి వచ్చాయి.
In view of extra passengers rush during the #summer season, #IRCTC is providing #economymeals for the convenience of General Coaches #passengers.
Provision has been made for economy meals alongwith packaged drinking water from the dispensing counters near General Coaches at the… pic.twitter.com/jC41RvLzJT
— IRCTC (@IRCTCofficial) April 23, 2024
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..