Home » Modernization of ITI’s | విద్యార్థుల‌కు గుడ్ న్యూస్.. ఐటీఐల ఆధునికీక‌ర‌ణ‌కు రూ.2,324.21 కోట్లు..
Outsourcing Employees

Modernization of ITI’s | విద్యార్థుల‌కు గుడ్ న్యూస్.. ఐటీఐల ఆధునికీక‌ర‌ణ‌కు రూ.2,324.21 కోట్లు..

Spread the love

Modernization of ITI’s | హైదరాబాద్‌: యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు, నైపుణ్యం కలిగిన మానవ వనరులతో పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీ) అప్‌గ్రేడ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ‌ను నైపుణ్యం కలిగిన యువశక్తికి కేంద్రంగా మార్చాల‌ని ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారు. రాష్ట్రంలో 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు దిగ్గ‌జ ఐటీ సంస్థ‌ టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (టీటీఎల్)తో ప్రభుత్వం ఇప్పటికే 10 ఏళ్ల అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది.

మంగళవారం మధ్యాహ్నం మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేయడంతోపాటు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా యువతకు ఏటీసీల్లో శిక్షణ ఇవ్వ‌నున్నారు. ఇందుకోసం ఏటీసీల్లో అధునాతన పరికరాలు, సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానున్నారు. ADCలలో యువతకు శిక్షణ ఇవ్వడానికి TTL ఇప్పటికే 130 మంది నిపుణులను నియమించింది. ప్రతి సంవత్సరం 5,860 మందికి పైగా ఆరు రకాల దీర్ఘకాలిక కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారు. 31,200 మందికి స్వల్పకాలిక కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. గత పదేళ్లలో కేవలం 1.5 లక్షల మందికి మాత్రమే ఐటీఐల్లో శిక్షణ అందించారు. ఈ ఏటీసీల్లో వచ్చే పదేళ్లలో నాలుగు లక్షల మందికి శిక్షణ ఇవ్వనున్నారు.

READ MORE  New Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీ మరింత ఆలస్యం, ఆరు గ్యారంటీల అర్జీల తర్వాతేనా?

Modernization of ITI’s : ఐటీఐలను ఏటీసీలుగా మార్చే ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.2,324.21 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.307.96 కోట్లతో 13.26 శాతం, టీటీఎల్ వాటా రూ.2016.25 కోట్లతో 86.74 శాతం. ఏటీసీలు వివిధ కోర్సుల్లో శిక్షణను అందించడమే కాకుండా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా కూడా పనిచేస్తాయి. ATCలు చిన్న, సూక్ష్మ, మధ్యతరహా, అలాగే పెద్ద తరహా పరిశ్రమలలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం సాంకేతిక కేంద్రాల (టెక్నాలజీ హబ్) పాత్రను కూడా పోషిస్తాయి. టీటీఎల్ ఏటీసీల్లో వివిధ కోర్సుల్లో శిక్షణ పొందిన వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. భవిష్యత్తులో పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ విద్యార్థులకు తమ సేవలను విస్తరింపజేయ‌నున్నారు.

READ MORE  Raitu RunaMafi | తెలంగాణలో రెండో విడత రైతు రుణమాపీ ఎప్పుడంటే..

 


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్రను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..