
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు నో చాన్స్
స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డిOutsourcing Employees Regularization : సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్టు (Contract Employees), ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అవకాశం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తే న్యాయస్థానాల్లో సమస్యలు వస్తాయని చెప్పారు. క్రమబద్ధీకరించేందుకు అవకాశం లేకపోయినా పట్టుబడితే సమస్య మరింత జటిలమవుతుంది తప్ప పరిష్కారం కాదని ఆయన అన్నారు. సమస్యల పరిష్కారానికి ధర్నాలు చేయాల్సిన పని లేదని.. చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు. రాజకీయాల కోసం కొందరు నిరసనలు, ధర్నాలకు ప్రేరేపిస్తున్నారని.. అలాంటి నేతల ఉచ్చులో పడితే చివరకు ఉద్యోగులే నష్టపోతారని సీఎం రేవంత్ హితువు పలికారు. ఒప్పంద, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఉన్నప్పటికీ చేయలేని పరిస్థితిలో ఉన్నామని ముఖ్యమం...