Thursday, February 13Thank you for visiting

Amgen | హైదరాబాద్‌లో ఆమ్‌జెన్ కొత్త రీసెర్చ్ సెంటర్.. 3,000 మందికి ఉద్యోగాలు

Spread the love

Amgen | ప్రపంచంలోని అతిపెద్ద బయో టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన ప్రఖ్యాత ఆమ్‌జెన్ (Amgen Inc) తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించనుంది. హైదరాబాద్‌లో కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ విభాగం ప్రారంభించనున్నట్లు కంపెనీ వెల్ల‌డించింది.

అమెరికా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల బృందం శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆమ్‌జెన్ ఆర్ అండ్ డీ కేంద్రంలో Amgen కంపెనీ ఎండీ డాక్టర్ డేవిడ్ రీస్, నేషనల్ ఎగ్జిక్యూటివ్ సోమ్ చటోపాధ్యాయతో సమావేశమై ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఆమ్‌జెన్ (Amgen) కొత్త రీసెర్చ్ సెంటర్ ను హైదరాబాద్ హైటెక్ సిటీలో ఆరు అంతస్తుల భవనంలో ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 3 వేల మందికి ఇక్కడ ఉద్యోగాలు లభించ‌నున్నాయి. ఈ సంవ‌త్స‌రం చివరి త్రైమాసికం నుంచే కంపెనీ తమ కార్యకలాపాలు ప్రారంభించనుంది.

READ MORE  Hydra: హైడ్రాకు.. అద‌న‌పు బలం.. ఇక నేరుగా రంగంలోకి

ఆమ్‌జెన్ (Amgen) ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో పేరొందిన బయోటెక్‌ సంస్థ హైదరాబాద్‌ను తమ కంపెనీ అభివృద్ధి కేంద్రంగా ఎంచుకోవడం త‌మ‌కు గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని అన్నారు. ఈ ఒప్పందం ద్వారా బయో టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ ప్రాధాన్యం మరింత పెరుగుతుందని తెలిపారు. ప్రపంచ స్థాయి సాంకేతికతతో రోగులకు సేవ చేయాలని కంపెనీ ఎంచుకున్న లక్ష్యం ఎంతో స్పూర్తిదాయకమైనదని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు.

మ‌రోవైపు ఆమ్‌జెన్ (Amgen) సంస్థ ఎండీ డాక్టర్ రీస్ మాట్లాడుతూ.. బయో టెక్నాలజీ రంగంలో గడిచిన 40 ఏళ్లుగా తాము అగ్రగామి సంస్థగా కొనసాగుతున్నామని అన్నారు. డేటా సైన్స్, అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కలయికతో కొత్త ఆవిష్కరణలతో మరిన్ని సేవలు అందించాలనే సంక‌ల్పంతో హైదరాబాద్ లో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నామని, బయోటెక్ రంగంలో ఇదొక అద్భుతమైన మైలురాయిగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

READ MORE  Group 1 Exams: నేటి నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌..

ఆమ్‌జెన్‌ ఇండియా తన కొత్త రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు హైదరాబాద్ ను కేంద్రంగా ఎంచుకోవటం ఆనందంగా ఉందని, దీని ద్వారా ప్రపంచ స్థాయిలో లైఫ్ సైన్సెస్ రంగానికి పూర్తి అనువైన ప్రాంతం హైదరాబాదే అని మరోసారి రుజువైందని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కంపెనీ విస్తరణకు ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. ఆమ్ జెన్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా వంద దేశాల్లో విస్తరించి ఉంది. ఈ సంస్థ‌కు దాదాపు 27 వేల మంది ఉద్యోగులున్నారు.

READ MORE  గ్లోబల్ సిటీ హైదరాబాద్ లో ఒక్క వర్షానికే వాగులుగా మారిన రహదారులు..

Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..