Home » Amazon Tez | అమెజాన్ యువ‌త‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. కొత్త సంవత్సరంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు !
Amazon Tez

Amazon Tez | అమెజాన్ యువ‌త‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. కొత్త సంవత్సరంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు !

Spread the love

Amazon Tez : అమెజాన్ ఇండియా ఈ నెలలో కొత్త సేవను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. ఈ స‌ర్వీస్ కింద, కస్టమర్లు కేవలం 15 నిమిషాల్లో ఇంట్లోనే అవసరమైన వస్తువులను ఆర్డర్ చేయగలరు. అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ సమీర్ కుమార్ న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ అమెజాన్ తేజ్ (Amazon Tez | అమెజాన్ యువ‌త‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. కొత్త సంవత్సరంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు పేరుతో కంపెనీ ఈ సేవను పరీక్షిస్తోంది.

ముందుగా కొన్ని నగరాల్లో Amazon Tez సర్వీస్

ముందుగా, అమెజాన్‌ Tez ఎంపిక చేయబడిన న‌గ‌రాల్లో ప్రారంభించనుంది. దీని తరువాత, ఈ సేవ మరిన్ని న‌గ‌రాల‌కు విస్తరించ‌నుంది. Blinkit మరియు Zepto వంటి కంపెనీల నుంచి అమెజాన్‌పై చాలా ఒత్తిడి ఉంది. 15 నిమిషాల డెలివరీతో తన బలాన్ని పుంజుకోవ‌చ్చ‌ని అమెజాన్ భావిస్తోంది.

READ MORE  LIC బీమా సఖీ స్కీమ్ లో ఎలా చేరాలి? , మీరు ప్రతి నెలా ఎంత డబ్బు సంపాదిస్తారు? పూర్తి వివరాలు..

సమీర్ కుమార్ మాట్లాడుతూ, వినియోగ‌దారులు ‘అవసరమైన వస్తువుల కోసం దుకాణానికి వెళ్లకుండా వారి ఇళ్లకు చేరుకుంటాయి. ఫాస్ట్ బిజినెస్ అంటే వస్తువుల సులభంగా ఇళ్ల‌కు చేర‌వేయ‌డం మేము మా స్వంత (పాస్ట్ బిజినెస్ ) స‌ర్వీస్ ను తీసుకురాబోతున్నాం. మేము రాబోయే వారాల్లో 15 నిమిషాల్లో వినియోగదారులకు అవ‌స‌ర‌మైన మా నిత్యావసర వస్తువుల డెలివ‌రీ చేస్తాం.దీని కోడ్‌నేమ్ Amazon Tez ఇది ఈ నెలలో ప్రారంభమవుతుంది.

20 లక్షల మందికి ఉద్యోగాలు

అమెజాన్ కాన్ఫరెన్స్‌లో స‌మీర్‌ కుమార్ భారతదేశంలో కంపెనీ భ‌విష్య‌త్‌ ప్రణాళికల గురించి చెప్పారు. భారతదేశంలో కొత్త ఉద్యోగాల గురించి ఒక పెద్ద ప్రకటన చేశారు. 2025 నాటికి భారత్‌లో 20 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తామని అమెజాన్ తెలిపింది. కంపెనీ తన వ్యాపారాన్ని పెంచుకోవడానికి, డెలివరీ స‌ర్వీస్ ను విస్త‌రించేందుకు కొత్త ఉద్యోగుల‌ను నియ‌మించుకుంటామ‌ని తెలిపింది.

READ MORE  Railway Jobs : రైల్వేలో 11,558 పోస్టుల‌కు నోటిఫికేష‌న్.. అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

2020లో భారతదేశంలో కొత్త ఉద్యోగాలను సృష్టిస్తామని వాగ్దానం చేసినప్పటి నుంచి కంపెనీ ఇప్పటికే ఎంతో మందికి ఉపాధి క‌ల్పించింది. ఈ-కామర్స్, డెలివరీ, ఉత్పత్తి, టెక్నాల‌జీ వంటి రంగాలలో సుమారు 14 లక్షల ఉద్యోగాలను సృష్టించినట్లు కంపెనీ తెలిపింది.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

READ MORE  Polytechnic colleges | విద్యార్థుల‌కు పండ‌గే.. హైదరాబాద్‌లో త్వరలో ఆరు కొత్త ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..