RRB NTPC Notification 2024 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 11558 రైల్వే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
RRB NTPC Notification 2024 | నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) శుభవార్త చెప్పింది. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. RRB NTPC రిక్రూట్‌మెంట్ 2024 కోసం అధికారిక నోటిఫికేషన్ సెప్టెంబర్ 2న విడుదలైంది.
గ్రాడ్యుయేట్ (లెవల్ 5, 6), అండర్ గ్రాడ్యుయేట్ (లెవల్ 2, 3) పోస్టులకు మొత్తం 11,558 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. గ్రాడ్యుయేట్-స్థాయి పోస్టులకు దరఖాస్తు ప్రక్రియకు గడువు సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 13 వరకు, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 వరకు ఉంటుంది.
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 990 పోస్టులు, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 361 పోస్టులు, ట్రైన్స్ క్లర్క్: 72 పోస్టులు, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 2022 పోస్టులు, గూడ్స్ ట్రైన్ మేనేజర్: 3144 పోస్టులు, జూనియస్ అకౌంట్ అసిస్టెంట్: 732 చీఫ్ కమర్షియల్ క్లర్క్ పోస్టులు: 1507 పోస్టులు, స్టేషన్ మాస్టర్: 994 పోస్టులు ఉన్నాయి.
అభ్యర్థులకు వయోపరిమితి ఎంత?
అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు అభ్యర్థుల వయస్సు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. గ్రాడ్యుయేట్ పోస్టులకు, వయస్సు 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పరీక్ష విధానం ఏమిటి?
ఎంపిక ప్రక్రియలో రెండు స్థాయిల ఆన్‌లైన్ పరీక్షలు ఉంటాయి: CBT 1 మరియు CBT 2. వీటిని అనుసరించి, టైపింగ్ టెస్ట్ (స్కిల్ టెస్ట్) లేదా ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అనంతరం సర్టిఫికెట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం..
RRB NTPC Notification 2024 : ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాలి. ముందుగా, rrbapply.gov.inలో అధికారిక RRB వెబ్‌సైట్‌ను సందర్శించండి. తర్వాత, RRB NTPC 2024 నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవండి. ముఖ్యమైన వివరాలను అర్థం చేసుకున్న తర్వాత, మీ పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ID మరియు మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. ఆ తర్వాత, లాగిన్ చేసి, ఖచ్చితమైన సమాచారంతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, ఆపై పేమెంట్ ఆప్షన్ కు వెళ్లండి. దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. పూర్తి చేసిన దరఖాస్తు గడువు తేదీలోపు సమర్పించబడిందని నిర్ధారించుకోండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..