Rythu runa Mafi | మూడ‌వ విడ‌త రుణ‌మాఫీపై స‌ర్కారు కీల‌క అప్ డేట్‌

Rythu runa Mafi | మూడ‌వ విడ‌త రుణ‌మాఫీపై స‌ర్కారు కీల‌క అప్ డేట్‌

వైరా సభ ద్వారా రైతులకు రుణ విముక్తి ప్రకటన

Rythu runa Mafi | ఖమ్మం : ‌రుణ‌మాఫీ ప‌థ‌కంపై కాంగ్రెస్ ప్ర‌భుత్వం కీల‌క అప్ డేట్ ఇచ్చింది. రెండు లక్షల వరకు రైతు రుణ మాఫీ ఆగస్టట్ 15‌లోపు చేస్తామని మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. శుక్రవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌జ‌ల సంక్షేమం కోసం నిబద్ధతతో పని చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు 15‌లోపు రుణాలు మాఫీ చేస్తామ‌ని తెలిపారు. వైరాలో భారీ రైతు బహిరంగ సభలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి, మంత్రివర్గం, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున పాల్గొంటారని చెప్పారు. వైరా నుంచి ఆగష్టు 15న రాష్ట్రంలో రైతులకు రుణ విముక్తి చేస్తామన్నారు. రైతుల రుణమాఫీ చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి చాలెంజ్‌ ‌చేశారని…. కాంగ్రెస్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు వైరా సభలో రైతులు పండుగ లాగా పాల్గొని మన రైతాంగ సోదరులు మంచి సందేశం ఇచ్చేలా సభ జరుపుతామన్నారు.

READ MORE  Coach Restaurant | వరంగల్ రైల్వే స్టేషన్ లో త్వరలో కోచ్ రెస్టారెంట్..

కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం.. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత 2 లక్షల రైతుల రుణ మాఫీ (Rythu runa Mafi) చేస్తాం అని హామీ ఇచ్చామని.. చేసి చూపిస్తున్నామని తెలిపారు. జూలై 15 న జీవో ఇచ్చామని.. 18 జూలైన ఒక లక్ష రూపాయల రుణ‌మాఫీ 6,983 కోట్లు విడుదల చేశామని తెలిపారు. రెండవసారి రూ.6190.02 కోట్లతో జూలైలో మళ్లీ విడుదల చేశామని తెలిపారు. లక్షన్నర వరకు రుణం ఉన్న రైతుల‌కు నేరుగా 12289 కోట్లు 16.29 లక్షల కుటుంబాలకు నిధులు విడుదల చేశామని భ‌ట్టి తెలిపారు.

రైతు భీమా

రాష్ట్ర బ్జడెట్‌లో రుణ మాఫీ ఒక్కటే కాదు… రైతు భీమాకి సంబంధించి 1,500 కోట్లు రైతుల తరుపున ప్రభుత్వం కడుతుందన్నారు. క్రాప్ట్ ఇన్సూరెన్స్ ‌కూడా చేస్తున్నామన్నారు. రైతులు కట్టాల్సిన రూ.1,350 కోట్లు కూడా కడుతున్నామని వెల్లడించారు. రాష్ట్ర బ‌డ్జెట్ లో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.72 వేల కోట్లు కేటాయించామని గుర్తుచేశారు. పండే ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఉద్యానవన పంటలు, డ్రిప్‌, ‌సింప్సన్‌కు ఆధునీకరణకు నిధులు మంజూరు చేశామన్నారు. రూ.1,450 కోట్లతో పూర్తి చేసే రాజీవ్‌, ఇం‌దిరా సాగర్‌ ‌ప్రాజెక్టులను రీ డిజైన్‌ ‌చేసి సీతారామ పేరు పెట్టి గ‌త‌ కేసీఆర్‌ ‌ప్రభుత్వం రూ.23 వేల కోట్లుకు పెంచి దోపిడీ చేసిందని ధ్వ‌జ‌మెత్తారు.

READ MORE  Red Alert | మరో రెండురోజులు దంచికొట్టనున్న వానలు.. ఏడు జిల్లాలకు రెడ్‌ అలెర్ట్

ఆనాటి నుంచి కాంగ్రెస్‌ ‌ఖండిస్తూ వస్తోందని అన్నారు. 8 వేల కోట్లు ఖర్చు పెట్టినా ఒక ఎకరాకు నీరివ్వలేని పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత‌ మంత్రుల సమక్షంలో స‌మీక్ష‌ చేశామన్నారు. తక్కువ ఖర్చుతో నీళ్ళు పారించే విధానంతో అతి తక్కువ ఖర్చుతో కేవలం రూ.75 కోట్లతో లక్షన్నర ఎకరాలు పండించేలా సీతారామ ప్రాజెక్ట్ ‌లింకు కెనాల్‌తో పనులు చేశామన్నారు. ఎన్‌ఎస్‌పీ లింకు , వైరా కెనాల్‌కు లింకు కలపటమే రేపటి కార్యక్రమమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

READ MORE  Amazon Web Services | హైద‌రాబాద్ లో అమెజాన్ విస్తరణ.. యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు

Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *