Cabinet Meet | తెలంగాణ కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు..

Cabinet Meet | తెలంగాణ కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు..
Spread the love

TS Cabinet Meet | హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమక్షంలో జరిగిన రాష్ట్ర కేబినెట్ మీటింగ్ లో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఈ స‌మావేశంలో సుమారు 4 గంటలపాటు పలు ముఖ్య‌మైన‌ అంశాలపై మంత్రులు చర్చించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌ సోనియా గాంధీని ఆహ్వానించాల‌ని కేబినెట్ నిర్ణయించింది. వచ్చే సీజన్ నుంచి సన్న వడ్లపై రూ.500 బోనస్ (Rs 500 Bonus ) చెల్లించాల‌ని, అలాగే ధాన్యం కొనుగోళ్లను త్వ‌రిత‌గ‌తిన పూర్తిచేయాల‌ని ప్రభుత్వం నిర్ణ‌యించింది. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల‌ని, కొనుగోలు ప్రక్రియ సుల‌భ‌త‌రంగా జ‌రిగేందుకు జిల్లా కలెక్టర్లు బాధ్యతలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

త‌డిసిన ధాన్యం కొనుగోలు

కేబినెట్ స‌మావేశం అనంత‌రం పూర్తి వివ‌రాల‌ను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు మీడియాకు సోమ‌వారం వెల్లడించారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్ప‌ష్టం చేశారు. మంగ‌ళ‌వారం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని వారు సూచించారు. ఎక్క‌డైనా నకిలీ విత్తనాలు విక్ర‌యిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. రైతులు సైతం లూజు విత్తనాలు కొనొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

READ MORE  IRCTC New Packeges 2024 | ప్రయాణికులకు అద్భుత అవకాశం.. తక్కువ ధరలో జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర

అమ్మ ఆద‌ర్శ క‌మిటీలు..

అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠ‌శాల‌ల‌ నిర్వహణ చేపట్టేందుకు కేబినెట్ నిర్ణయించిందని మంత్రలు వివ‌రించారు. జూన్ 12 స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి త‌గిన చర్యలు తీసుకునేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇక జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంద‌ర్బంగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

వేడుకల‌కు కేసీఆర్‌కు ఆహ్వానం:

రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ప్రభుత్వం తరపున మాజీ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం ప‌లుకుతామ‌ని ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పాఠశాలలు పున:ప్రారంభమయ్యే జూన్ 12 లోగా విద్య వ్యవస్థలో మార్పులు చూపించాలని కెబినెట్ నిర్ణయించిందని చెప్పారు. ఒక్క గింజ కూడా తరుగు లేకుండా కొనుగోలు చేస్తామ‌ని, మూడు రోజుల్లో డ‌బ్బులు రైతుల ఖాతాల్లో జ‌మ అయ్యేలా చూస్తామ‌న్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అకాల వర్షాలపై సమీక్షిస్తున్నారని, విద్య వ్యవస్థ ప‌టిష్టానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. మానవ వనరులపై సమీక్షను త్వ‌ర‌లో నిర్వ‌హిస్తామ‌ని, ఇందుకు రూ.600 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి శ్రీధర్ బాబు వెల్ల‌డించారు.

READ MORE  శ్రీశైలానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన టీఎస్‌ఆర్టీసీ

మ‌రోవైపు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామ‌ని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ధాన్యం కొనుగోలు జ‌రుగుతున్నాయ‌ని, ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల ప్రారంభించాల్సి ఉంద‌ని తెలిపారు. ధాన్యం కొనుగోలుపై బీఆర్ఎస్ ఆరోప‌ణ‌లు అవాస్త‌మ‌వ‌ని తెలిపారు. డీఎస్సీ నోటిఫికేషన్‌పై చిత్తశుద్ధితో ప‌నిచేస్తున్నామ‌ని మంత్రి తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహిస్తామ‌ని వెల్ల‌డించారు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి.. ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

READ MORE  Discount On iPhone 15 Plus : ఐఫోన్ పై బిగ్ డిస్కౌంట్ డీల్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *