Kavach System | ఇక రైల్వేల్లో యుద్ధప్రాతిపదికన కవచ్ వ్యవస్థ ఏర్పాటు : అశ్విని వైష్ణవ్
Indian Railways | రైలు ప్రమాదాల నివారణకు కవాచ్ టెక్నాలజీ ( Kavach System )ని ఇప్పుడు దేశంలో మిషన్ మోడ్‌లో అమలు చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. హై టెక్నాలజీ, కఠినమైన భద్రతకు మారుపేరుగా కవాచ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ATP) వ్యవస్థ గుర్తింపు పొందింది. అయితే ఇప్పుడు భారతీయ రైల్వేల్లోని అన్ని రూట్లలో ఇప్పుడు వేగంగా ఇన్ స్టాల్ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఈ వ్యవస్థ అవసరమైతే ఆటోమెటిక్ గా బ్రేక్‌లను వేయడం ద్వారా అత్యవసర సమయాల్లో రైలు ప్రమాదాలు జరగకుండా అడ్డుకుంటుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రైలును సురక్షితంగా నడిపేలా చేస్తుంది. ఇటీవల కాలంలో పలుచోట్ల రైలు ప్రమాదాలు జరగగా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. రైల్వే ఆస్తులు ధ్వంసమయ్యాయి ఈ నేపథ్యంలోనే కవచ్ ఇన్‌స్టాలేషన్ (Kavach System ) విషయమై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది.
రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో గణనీయమైన పురోగతి గురించి కేంద్ర మంత్రి వైష్ణవ్ వెల్లడించారు. గత దశాబ్దంలో 31,180 కి.మీ కొత్త ట్రాక్‌లు కవచ్ కింద వచ్చాయి. ఇది ఫ్రాన్స్ మొత్తం రైలు నెట్‌వర్క్‌ను అధిగమించింది. రోజూ 14 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్‌లు వేస్తున్నట్లు తెలిపారు. అదనంగా, స్వాతంత్ర్యం నుంచి 2014 వరకు 21,000 కి.మీ ట్రాక్‌లు విద్యుదీకరించబడినప్పటికీ, గత దశాబ్దంలో 40,000 కి.మీ వరకు ఎలక్ట్రిఫికేషన్ జరిగింది.
రైల్వే కార్యక్రమాలు
ట్రాక్ విద్యుదీకరణ, వందే భారత్ రైళ్లు, వందే మెట్రో ట్రయల్, కవాచ్ యాంటీ-కొల్లిషన్ సిస్టమ్ రోల్ అవుట్‌తో సహా అనేక కొత్త కార్యక్రమాలనురైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అయిన దేశంలో 1326 రైల్వే స్టేషన్‌లను పునరాభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. “కవాచ్ వంటి ఆధునిక సాంకేతికత దేశంలోనే అభివృద్ధి చేశామని, ఇప్పుడు దేశంలో మిషన్ మోడ్‌లో అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
దశాబ్దాలుగా కొనసాగిన రైల్వేలో సాంకేతిక పురోగతి, పెట్టుబడుల కొరతను వైష్ణవ్ హైలైట్ చేశారు. వైష్ణవ్ ప్రకారం, రైల్వేలు ఒకప్పుడు రాజకీయీకరణలో చిక్కుకున్నాయి, కానీ మోదీ నాయకత్వంలో గణనీయమైన అభివృద్ధిని చూశాయని చెప్పారు. కొద్ది రోజుల క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ మూడు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాని మోదీ రైల్వేలతో సహా వివిధ రంగాలలో నిర్ణయాత్మకమైన మార్పులను తీసుకువచ్చారని వైష్ణవ్ ప్రశంసించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..