Thursday, July 10Welcome to Vandebhaarath

Tag: Railway Safety

Stone Pelting Incident |  భారతీయ రైళ్లపై పెరుగుతున్న వ‌రుస‌ రాళ్ల దాడులు.. ఎక్కవగా ఈ రైళ్లపై దాడులు..
Trending News

Stone Pelting Incident | భారతీయ రైళ్లపై పెరుగుతున్న వ‌రుస‌ రాళ్ల దాడులు.. ఎక్కవగా ఈ రైళ్లపై దాడులు..

Stone Pelting Incident | దేశంలో కొంద‌రు దుండ‌గులు ఉద్దేశ‌పూర్వ‌కంగా అల‌జ‌డులు సృష్టించేందుకు కుట్ర‌లు ప‌న్నుతున్నారు. ఇందుకోసం భార‌తీయ రైల్వేల‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో వందేభార‌త్ రైలుపై దుండగులు రాళ్ల‌దాడి చేశారు. అంబ్-అండౌరా స్టేషన్ నుంచి న్యూఢిల్లీకి వెళుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా ప్రాంతంలో రాళ్లు రువ్వారు. ఈ ఘ‌ట‌న‌లో రైలులోని సుమారు నాలుగు కోచ్‌లు దెబ్బతిన్నాయి. గ‌త శనివారం మధ్యాహ్నం 1:15 గంటల ప్రాంతంలో బసల్ గ్రామ సమీపంలో రైలుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వి రెండు కోచ్‌ల కిటికీ అద్దాలను పగులగొట్టారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదు.రైలుకు జ‌రిగిన‌ నష్టంపై అంచనా వేస్తున్నట్లు రైల్వే పోలీసు అధికారులు తెలిపారు. ఘటనకు బాధ్యులైన నిందితులను పట్టుకునేందుకు గాలింపు చేప‌ట్టిన‌ట్లు వారు తెలిపారు. ...
Kavach System |  ఇక రైల్వేల్లో యుద్ధప్రాతిప‌దిక‌న క‌వ‌చ్ వ్య‌వ‌స్థ ఏర్పాటు : అశ్విని వైష్ణవ్
National

Kavach System | ఇక రైల్వేల్లో యుద్ధప్రాతిప‌దిక‌న క‌వ‌చ్ వ్య‌వ‌స్థ ఏర్పాటు : అశ్విని వైష్ణవ్

Indian Railways | రైలు ప్ర‌మాదాల నివార‌ణ‌కు క‌వాచ్ టెక్నాలజీ ( Kavach System  )ని ఇప్పుడు దేశంలో మిషన్ మోడ్‌లో అమలు చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. హై టెక్నాలజీ, కఠినమైన భద్రతకు మారుపేరుగా కవాచ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ATP) వ్యవస్థ గుర్తింపు పొందింది. అయితే ఇప్పుడు భార‌తీయ రైల్వేల్లోని అన్ని రూట్ల‌లో ఇప్పుడు వేగంగా ఇన్ స్టాల్ చేయ‌నున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.ఈ వ్యవస్థ అవసరమైతే ఆటోమెటిక్ గా బ్రేక్‌లను వేయ‌డం ద్వారా అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో రైలు ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా అడ్డుకుంటుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రైలును సురక్షితంగా నడిపేలా చేస్తుంది. ఇటీవ‌ల కాలంలో ప‌లుచోట్ల రైలు ప్ర‌మాదాలు జ‌ర‌గ‌గా పెద్ద సంఖ్య‌లో ప్ర‌యాణికులు ప్రాణాలు కోల్పోయారు. రైల్వే ఆస్తులు ధ్వంస‌మ‌య్యాయి ఈ నేప‌థ్యంలోనే క‌వ‌చ్ ఇన్‌స్టాలేషన్ (Kavach System  ) విష‌య‌మై కేంద్రం ...
Railway Safety | పెరుగుతున్న రైలు ప్రమాదాల నివార‌ణ‌కు ఇక‌పై రైల్వే ఇంజన్లు, యార్డులపై AI- ఎనేబుల్డ్ సీసీ కెమెరాలు
National

Railway Safety | పెరుగుతున్న రైలు ప్రమాదాల నివార‌ణ‌కు ఇక‌పై రైల్వే ఇంజన్లు, యార్డులపై AI- ఎనేబుల్డ్ సీసీ కెమెరాలు

Indian Railways |  ఇటీవ‌ల కాలంలో దేశవ్యాప్తంగా పెరుగుతున్న రైలు ప్రమాదాలు అంద‌ర్నీ ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భార‌తీయ రైల్వే కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  రైల్వే భద్రత (Railway Safety) కోసం  ఇక‌పై బోర్డు అన్ని ఇంజన్లు, కీలక యార్డుల వద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో కూడిన CCTV కెమెరాలను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈమేర‌కు ప్రయాగ్‌రాజ్ రైల్వే జంక్షన్‌లో విలేకరుల సమావేశంలో, రైల్వే బోర్డు చైర్‌పర్సన్, సీఈఓ జయ వర్మ సిన్హా వివ‌రాలు వెల్ల‌డించారు. అసాధారణ పరిస్థితులను గుర్తించేందుకు భద్రతా చర్యలను మెరుగుపరిచేందుకు ఈ AI- ఎనేబుల్డ్ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. "మేము ప్రతి లోకోమోటివ్, అన్ని ముఖ్యమైన యార్డ్‌లలో AI టెక్నాల‌జీతో ప‌నిచేసే CCTV కెమెరాలను ఇన్‌స్టాల్ చేస్తున్నామ‌న‌ని ఆమె చెప్పారు.రైల్వే ట్రాక్ భద్రతను ప్రస్తావిస్తూ కుంభమేళా సందర్భంగా సంఘవిద్...
Railway Budget 2024 | రైల్వేల భ‌ద్ర‌త‌కు భారీగా కేటాయింపులు.. సామాన్య ప్రజల కోసం కీలక నిర్ణయాలు
Business

Railway Budget 2024 | రైల్వేల భ‌ద్ర‌త‌కు భారీగా కేటాయింపులు.. సామాన్య ప్రజల కోసం కీలక నిర్ణయాలు

Railway Budget 2024 | రైలు భద్రతను పెంపొందించడానికి, “కవాచ్” ఆటోమేటిక్ రైలు-రక్షణ వ్యవస్థను అమ‌లు చేయడానికి భారతీయ రైల్వే తన బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించ‌నుంద‌ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. మొత్తం రూ.2,62,200 కోట్ల రైల్వే బడ్జెట్‌లో రికార్డు స్థాయిలో రూ.1,08,795 కోట్లను పూర్తిగా రైల్వే భద్రతా చ‌ర్య‌ల‌కు కేటాయించినట్లు వైష్ణవ్ వెల్లడించారు. వీటిలో పాత ట్రాక్‌ల భర్తీ, సిగ్నలింగ్ సిస్టమ్ మెరుగుదల, కవాచ్‌ను ఏర్పాటు చేయడంతోపాటు ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం వంటివి ఉన్నాయి.“ఈ కేటాయింపులో పెద్ద భాగం - రూ. 1,08,795 కోట్లు - పాత ట్రాక్‌లను కొత్త వాటితో భర్తీ చేయడం, సిగ్నలింగ్ వ్యవస్థలో మెరుగుదల, ఫ్లైఓవర్‌లు, అండర్‌పాస్‌ల నిర్మాణం, కవాచ్‌ను ఇన్‌స్టాల్ చేయడం వంటి భద్రతా సంబంధిత కార్యకలాపాలకు కేటాయించ‌నున్న‌ట్లు చెప్పారు. రైల్వే బడ్జెట్ కవాచ్‌కు ప్రాధాన్యం కవాచ్‌కు ఇచ్చి...
Railways News | ప్ర‌యాణికులకు గుడ్ న్యూస్‌.. రైళ్ల‌లో పెర‌గ‌నున్న కోచ్‌ల సంఖ్య
National

Railways News | ప్ర‌యాణికులకు గుడ్ న్యూస్‌.. రైళ్ల‌లో పెర‌గ‌నున్న కోచ్‌ల సంఖ్య

Railways News | న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే మంత్రిగా వరుసగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన వెంటనే అశ్విని వైష్ణవ్ ఈ క్యాలెండర్ ఇయర్‌కు లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. వైష్ణవ్ తన బాధ్యతలను స్వీకరించిన వెంట‌నే రైల్వే ఉన్న‌తాధికారుల‌తో సమావేశం నిర్వ‌హించారు. ప్ర‌యాణికుల‌కు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కోచ్‌లను పెంచడం ద్వారా రద్దీని తగ్గించాల‌ని నిర్ణ‌యించారు. డిమాండ్ ఎక్కువ‌గా ఉన్న మార్గాల్లో ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా క్లోన్ రైలు అని పిలువబడే అదనపు రైళ్ల‌ను నడపాల‌ని భావిస్తున్న‌ట్లు రైల్వే వ‌ర్గాలు తెలిపాయి. వేసవిలో అత్యధిక ప్రయాణ రద్దీని త‌గ్గించ‌డానికి ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇండియ‌న్ రైల్వే అద‌న‌పు రైళ్ల‌ను న‌డిపించిన విష‌యం తెలిసిందే.. .వందే మెట్రోను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు ప్రభుత్వం కూడా ఆసక్తిగా ఉందని అధికారులు తెలిపారు. "రెండు వందే మెట్రో కోచ్‌ల ఉత్పత్తి పూర్తయింది. ట్రయల్స్ ఏ ర...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..