Railway Budget 2024 | రైలు భద్రతను పెంపొందించడానికి, “కవాచ్” ఆటోమేటిక్ రైలు-రక్షణ వ్యవస్థను అమలు చేయడానికి భారతీయ రైల్వే తన బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించనుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. మొత్తం రూ.2,62,200 కోట్ల రైల్వే బడ్జెట్‌లో రికార్డు స్థాయిలో రూ.1,08,795 కోట్లను పూర్తిగా రైల్వే భద్రతా చర్యలకు కేటాయించినట్లు వైష్ణవ్ వెల్లడించారు. వీటిలో పాత ట్రాక్‌ల భర్తీ, సిగ్నలింగ్ సిస్టమ్ మెరుగుదల, కవాచ్‌ను ఏర్పాటు చేయడంతోపాటు ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం వంటివి ఉన్నాయి.
“ఈ కేటాయింపులో పెద్ద భాగం – రూ. 1,08,795 కోట్లు – పాత ట్రాక్‌లను కొత్త వాటితో భర్తీ చేయడం, సిగ్నలింగ్ వ్యవస్థలో మెరుగుదల, ఫ్లైఓవర్‌లు, అండర్‌పాస్‌ల నిర్మాణం, కవాచ్‌ను ఇన్‌స్టాల్ చేయడం వంటి భద్రతా సంబంధిత కార్యకలాపాలకు కేటాయించనున్నట్లు చెప్పారు.
రైల్వే బడ్జెట్ కవాచ్‌కు ప్రాధాన్యం
కవాచ్‌కు ఇచ్చిన ప్రాధాన్యతను హైలైట్ చేస్తూ, రైల్వే మంత్రి.. కవాచ్ 4.0 కి రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఇటీవల ఆమోదం తెలిపింది. ఈ క్రమంలోనే , ఈ కవాచ్ వ్యవస్థను దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు. ఇప్పటివరకు 4,275 కి.మీలకు పైగా ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వేయడం, టెలికాం టవర్లు, ట్రాక్ RFID పరికరాలు, స్టేషన్ కవాచ్, లోకో కవాచ్ వంటి ఇతర భాగాలను ఇన్‌స్టాల్ చేసినట్లు మంత్రి వైష్ణవ్ గుర్తుచశారు.
గత సంవత్సరాలతో ప్రస్తుత కేటాయింపులను పోల్చి చూస్తే, 2014లో రైల్వేల బడ్జెట్ దాదాపు రూ. 35,000 కోట్లుగా ఉందని, ఇది ప్రస్తుత రూ. 2.62 లక్షల కోట్లకు పెంచినట్లు తెలిపారు. “2014లో రైల్వేలకు బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం కేవలం రూ.35,000 కోట్లు మాత్రమే. కానీ తాజా బడ్జెట్‌లో రూ.2.62 లక్షల కోట్ల కొత్త స్థాయికి చేరింది. ఈ బడ్జెట్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత 10 ఏళ్ల పాలనలో కఠోర శ్రమను, కేంద్రీకృత విధానాన్ని ముందుకు తీసుకువెళుతుంది ’’ అని రైల్వే మంత్రి పేర్కొన్నారు.
2014కు ముందు 60 ఏళ్లలో కేవలం 20,000 కి.మీ రైలు మార్గం మాత్రమే విద్యుదీకరించారు. కానీ గత 10 సంవత్సరాలలో 40,000 కి.మీ రైలు మార్గం విద్యుదీకరించారు. అదేవిధంగా, 2014లో, సగటున రోజుకు 4 కి.మీ కొత్త ట్రాక్ నిర్మాణం జరిగింది. అయితే గత ఆర్థిక సంవత్సరంలో, రైల్వేలు రోజుకు సగటున 14.5 కి.మీ ట్రాక్‌లను నిర్మించాయి, అంటే మొత్తం ఆర్థిక సంవత్సరంలో 5,300 కి.మీ నిర్మించింది. అని తెలిపారు.
తక్కువ, మధ్య-ఆదాయ వర్గాలపై దృష్టి
Railway Budget 2024 : రైల్వేలు తక్కువ, మధ్య-ఆదాయ వర్గాలకు చెందిన ప్రయాణీకులకు సేవలను అందజేస్తాయని, దీనికి అనుగుణంగా, ప్రతీ రైలులో మూడింట ఒక వంతు ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లకు మూడింట రెండు వంతుల సాధారణ కోచ్‌ల నిష్పత్తిని కొనసాగిస్తున్నట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. సాధారణ కోచ్‌లకు పెరుగుతున్న డిమాండ్‌కు ప్రతిస్పందనగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదనంగా 2,500 కోచ్‌లను తయారు చేయనున్నట్లు వైష్ణవ్ వెల్లడించారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా మరో 10,000 జనరల్ కోచ్‌లను తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు, ఈ రెండు నిర్ణయాలను బడ్జెట్‌లో చేర్చినట్లు తెలిపారు.
ఉపాధికి సంబంధించి, మోదీ ప్రభుత్వ హయాంలో రైల్వే ఉద్యోగ అవకాశాలు 20% పెరిగాయని వైష్ణవ్ తెలిపారు. “ఉపాధి విషయానికి వస్తే, 10 సంవత్సరాల యుపిఎ పాలనలో, రైల్వేలో 4.11 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. అయితే మోదీ పాలనలో 10 సంవత్సరాలలో ఐదు లక్షల ఉద్యోగాలు అందించామని. ఇది యుపిఎ పాలన కంటే 20 శాతం ఎక్కువ. ,” కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..