Mudra loans | న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తూ కోట్లాది ఉద్యోగాలను సృష్టిస్తున్న ఎమ్‌ఎస్‌ఎమ్‌ఇ రంగాన్ని పునరుజ్జీవింపజేసే ప్రయత్నాల్లో ఎన్‌డిఎ ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకొచ్చింది. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈ) కోసం ఇంతకు ముందు రుణాలు పొంది విజయవంతంగా తిరిగి చెల్లించిన వారికి ముద్ర రుణాల పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం తెలిపారు. కేంద్రం నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ప్రధాన్ మంత్రి ముద్ర యోజన పథకాన్ని ఏప్రిల్ 8, 2015న మోదీ ప్రభుత్వం ప్రారంభించింది. కార్పొరేట్‌యేతర, వ్యవసాయేతర చిన్న, సూక్ష్మ పారిశ్రామికవేత్తలకు 10 లక్షల రూపాయల (Mudra loans ) వరకు సులువుగా రుణాలు అందించేదుకు ఈ పథకాన్ని అమలు చేసింది. ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో 43 కోట్ల రుణాలను రూ.22.5 లక్షల కోట్లకు పొడిగించింది.
ఉత్పాదక రంగంలోని MSMEల కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని కూడా ప్రకటించింది. దీని కింద సంస్థలు ఎటువంటి కొలేటరల్ లేదా థర్డ్-పార్టీ గ్యారెంటీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా రుణాలు తీసుకోవచ్చు. యంత్రాల కొనుగోలుకు కూడా టర్మ్ లోన్ సౌకర్యం కల్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు.
ఎమ్‌ఎస్‌ఎమ్‌ఇలకు రుణాలు అందించే ప్రక్రియను సులభతరం చేయడానికి సరికొత్త, స్వతంత్ర అంతర్గత మెకానిజం మెరుగుపరుచుకోవాలని బ్యాంకర్లకు కేంద్ర మంత్రి సూచించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు బాహ్య మదింపుపై ఆధారపడకుండా, క్రెడిట్ కోసం ఎమ్‌ఎస్‌ఎమ్‌ఇలను అంచనా వేయడానికి వారి అంతర్గత సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ప్రతిపాదించారు.
కాగా, రుణగ్రహీతలు ఒత్తిడికి లోనవుతున్న సమయంలో బ్యాంకు రుణాలను కొనసాగించేందుకు కేంద్రం కొత్త పద్ధతులతో ముందుకు వస్తోంది. TREDS ప్లాట్‌ఫారమ్‌లో తప్పనిసరి ఆన్‌బోర్డింగ్ కోసం కొనుగోలుదారుల టర్నోవర్ థ్రెషోల్డ్‌ను రూ. 500 కోట్ల నుండి రూ. 250 కోట్లకు తగ్గించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇది ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ MSMEలకు సహాయం చేయడానికి ఉద్దేశించింది.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..