RRR | ఆర్‌ఆర్‌ఆర్ కోసం భూసేక‌ర‌ణపై ప్ర‌భుత్వం కీల‌క ఆదేశాలు

RRR | ఆర్‌ఆర్‌ఆర్ కోసం భూసేక‌ర‌ణపై ప్ర‌భుత్వం కీల‌క ఆదేశాలు

హైదరాబాద్‌ ‌రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు (RRR ) ‌ప్రాజెక్టుకు కావ‌ల‌సిన భూసేకరణ కు మొద‌టి ప్రాధాన్యం ఇచ్చి సెప్టెంబర్‌ ‌రెండవ వారంలోగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు నిర్మాణ పనుల పురోగతిపై మంగళవారం హైద‌రాబాద్ లోని సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఎస్‌ ‌శాంతి కుమారి మాట్లాడుతూ… హైద‌రాబాద్ లోప్రతిష్టాత్మక ఆర్‌ఆర్‌ఆర్‌ ‌ప్రాజెక్టుపై ప్ర‌భుత్వం అత్యధిక ప్రాముఖ్యత‌ను ఇస్తోంద‌ని అన్నారు. ఈ ప్రాజెక్ట్ ‌సంబంధించి వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్ర‌క్రియను వేగవంతం చేయాలని సూచించారు. భూసేరణ నష్ట పరిహారానికి సంబంధించిన అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించి భూములు కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

READ MORE  ఆర్టీసీ-ప్రభుత్వ విలీనానికి తెలంగాణ గవర్నర్ బ్రేక్

RRR కింద భూములు కోల్పోతున్న రైతులకు సరైన నష్టపరిహారం అందేలా జిల్లా స్థాయిల్లో కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలను ఏర్పాటు చేసి భూముల మార్కెట్‌ ‌విలువ ఆధారంగా పరిహారం అందించాల‌ని చెప్పారు. కోర్టు కేసులపై కూడా ప్రత్యేక చొరవ తీసుకోవాల‌ని, త్వరితగతిన కేసులు పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. ఈ సమీక్షా సమావేశానికి రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్‌, ‌ప్రభుత్వ సలహాదారులు శ్రీనివాస్‌రాజు, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవిన్‌ ‌మిట్టల్‌, అటవీ శాఖ అడిషనల్‌ ‌సెక్రటరీ ప్రశాంతి, ఆర్ అండ్‌ బి శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన, సంయుక్త కార్యదర్శి హరీష్‌, ‌రంగారెడ్డి, మెదక్‌, ‌సంగారెడ్ది, యాదాద్రి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్లొన్నారు.

READ MORE  SCR Special Trains | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ మీదుగా పలు ప్రత్యేక రైళ్ల పొడిగింపు

Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *