రాజస్తాన్ లో మరో యోగీ.. సీఎం పదవి రేసులో మహంత్ బాలక్ నాథ్..
Rajasthan Assembly Election: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోయింది. విజయం దాదాపు ఖరారయ్యింది. కాగా.. ఊహించని విధంగా రాజస్తాన్ ముఖ్యమంత్రి రేసులోకి ఓ సన్యాసి తెరపైకి రావడం ఇప్పుడు సంచలనంగా మారింది.
రాజస్తాన్ లో బీజేపీ విజయం ఖాయమైన క్రమంలో ఇప్పుడు సీఎం ఎవరు అవుతారనేదానిపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే సీఎం రేసులో వసుంధర రాజే ముందుండగా మరోవైపు మహంత్ బాలక్ నాథ్ (Mahant Balak Nath) కూడా తెరపైకి వచ్చారు. ఆయనకు ఆర్ఎస్ఎస్, బీజేపీ అధిష్ఠానం ఆశీస్సులు ఉండడండంతో అనూహ్యంగా ఈ రేసులోకి దూసుకువచ్చారు.
40 ఏళ్ల మహంత్ బాలక్ నాథ్ రాజస్తాన్ (Rajasthan) లోని అల్వార్ నియోజకవర్గం నుంచి లోక్ సభ సభ్యుడిగా ఉన్నారు.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తిజార (Tijara) సెగ్మెంట్ నుంచి పోటీ చేశారు. ఈ స్థానం నుంచి ఆయన విజయం సాధించారు. ఆయన రాజస్తాన్ సీఎం పదవికి పోటీ పడుతున్నట్లు మీడియాలో జోరుగా కథనాలు వస్తున్నాయి. పార్టీ హై కమాండ్ కూడా ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
చిన్న వయస్సులోనే సన్యాసం
మహంత్ బాలక్ నాథ్ చాలా చిన్న వయస్సులోనే సన్యాసం స్వీకరించారు. కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు ఆరేళ్ల ప్రాయంలోనే ఆయన సన్యాస దీక్ష తీసుకున్నారు. పూర్తిగా సమాజానికి సేవ చేయడానికి తాను ఆ మార్గం స్వీకరించానని బాలక్ నాథ్ చెబుతారు. అల్వార్ ప్రాంతంలో ఆయనకు పెద్ద ఎత్తున అభిమానులు, భక్తులు ఉన్నారు. ఆదివారం కౌంటింగ్ ప్రారంభానికి ముందు అల్వార్ లోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సీఎం అభ్యర్థిత్వంపై బాలక్ నాథ్ ఏమన్నారు..
సీఎం పదవి రేసులో ఉండడంపై మహంత్ బాలక్ నాథ్ Mahant Balak Nath స్పందిస్తూ, సీఎం ఎవరనేది పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. ‘‘సీఎం పదవి ముఖ్యం కాదు. ప్రధాని మోదీ నాయకత్వంలో మేమంతా పని చేస్తాం. ముఖ్యమంత్రి ఎవరనేది పార్టీనే నిర్ణయిస్తుంది’’ అన్నారు. కాగా, కౌంటింగ్ కు ముందు రోజు, డిసెంబర్ 2 వ తేదీన ఆయన బీజేపీ కీలక వ్యూహకర్త, పార్టీ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్ తో ప్రత్యేకంగా సమావేశం కావడంతో ఆయన సీఎం రేసులో ఉన్నరన్న విషయం వైరల్ గా మారింది. అయితే, తాను మర్యాదపూర్వకంగానే బీఎల్ సంతోష్ ను కలిశానని మహంత్ బాలక్ నాథ్ తెలిపారు.
న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి
యోగి ఆదిత్యనాథ్ తరహాలో..
ఉత్తర ప్రదేశ్ సీఎం, గోరఖ్ పూర్ మఠాధిపతి యోగి ఆదిత్యానాథ్ తరహాలో మహంత్ బాలక్ నాథ్ కూడా నాథ్ సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం. అల్వార్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిగా బాలక్ నాత్ నిలిచారు. అయితే, ప్రస్తుతం బీజేపీ తరఫున రాజస్తాన్ సీఎం రేసులో మాజీ సీఎం వసుంధర రాజె సింథియా, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా ఉండడం గమనార్హం.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..