Home » రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ సెంటర్లు ఎక్కడంటే..
One Nation One Election Bill

రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ సెంటర్లు ఎక్కడంటే..

Spread the love

తెలంగాణ రాష్ట్రంలో (Telangana Elections 2023) పోలింగ్ ప్రక్రియ పరిసమాప్తమైంది. ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంల్లో (EVM) నిక్షిప్తం చేశారు. డిసెంబరు 3న (ఆదివారం) ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ (Counting Process) మొదలు కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లో ఓట్ల లెక్కింపు (Postal Ballot Counting) తర్వాత ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభించనున్నారు.
ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ సెంటర్లను (Election Counting centers) ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లోని పలు కార్యాలయాలు, విద్యాసంస్థల్లో లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలో కౌంటింగ్ సెంటర్ల వివరాలు ఇలా ఉన్నాయి..

Election Counting centers

1. ఆసిఫాబాద్: నియోజకవర్గం: సిర్పూర్ ఓట్ల లెక్కింపు కేంద్రం: ఎస్సీ వెల్ఫేర్ గురుకుల కళాశాల, ఆసిఫాబాద్
2. మంచిర్యాల: చెన్నూరు-బెల్లంపల్లి-మంచిర్యాల అజీజియా ఇంజనీరింగ్ కళాశాల, మంచిర్యాల
3. ఆదిలాబాద్: ఆదిలాబాద్, బోథ్ టెక్నికల్ ట్రైనింగ్, డెవలప్మెంట్ సెంటర్, ఆదిలాబాద్
4. నిర్మల్: ఖానాపూర్, నిర్మల్, ముథోల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నిర్మల్
5. నిజామాబాద్: ఆర్మూర్, బాన్స్ వాడ, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్, నిజామాబాద్
6. నిజామాబాద్: బోధన్ ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్, నిజామాబాద్
7. కామారెడ్డి: జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి ఏఎంసీ గోడౌన్, కామారెడ్డి
8. జగిత్యాల: కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి వీఆర్కే ఇంజనీరింగ్ కళాశాల, జగిత్యాల
9. పెద్దపల్లి: రామగుండం, మంథని, పెద్దపల్లి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, మంథని

READ MORE  ఇంటిగ్రేటెడ్‌ ‌రెసిడెన్షియల్‌ ‌పాఠశాలలపై కీలక ఆదేశాలు.. వచ్చే నెలలోనే ప్రారంభం!

10. కరీంనగర్: కరీంనగర్, చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్ ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ కళాశాల
11. సిరిసిల్ల: వేములవాడ, సిరిసిల్ల ఎస్సీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల, సిరిసిల్ల
12. సంగారెడ్డి: నారాయణఖేడ్, ఆందోల్, జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్ చెరు గీతం యూనివర్సిటీ
13. మెదక్: మెదక్, నర్సాపూర్ వైపీఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, హవేలీఘనపూర్
14. సిద్దిపేట: హుస్నాబాద్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ ఇందూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, సిద్దిపేట 15. రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి సి.వి.ఆర్. ఇంజనీరింగ్ కళాశాల, ఇబ్రహీంపట్నం
16. రంగారెడ్డి: ఎల్బీనగర్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం
17. రంగారెడ్డి: రాజేంద్ర నగర్, చేవెళ్ల, షాద్ నగర్ లార్డ్స్ ఇంజనీరింగ్ కళాశాల, రాజేంద్రనగర్
18. రంగారెడ్డి: శేరిలింగంపల్లి బాలయోగి స్టేడియం, గచ్చిబౌలి
19. వికారాబాద్: పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్ ఏఎంసీ గోడౌన్, పరిగి
20. మేడ్చల్ మల్కాజ్ గిరి: మేడ్చల్, మల్కాజ్ గిరి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, ఉప్పల్ హోలీమేరి ఇంజనీరింగ్ కళాశాల, కీసర
21. హైదరాబాద్: ముషీరాబాద్ ఏవీ కళాశాల, దోమల్ గూడ
22. హైదరాబాద్: మలక్ పేట ఇండోర్ స్టేడియం, అంబర్ పేట
23. హైదరాబాద్: అంబర్ పేట: రెడ్డి ఉమెన్స్ కళాశాల, నారాయణగూడ
24. హైదరాబాద్: ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం, యూసుఫ్ గూడ
25. హైదరాబాద్: సనత్ నగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్, ఓయూ
26. హైదరాబాద్: నాంపల్లి జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్, మాసబ్ ట్యాంక్
27. హైదరాబాద్: కార్వాన్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, మాసబ్ ట్యాంక్
28. హైదరాబాద్: గోషామహల్ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, కోఠి
29. హైదరాబాద్: చార్మినార్ కమలానెహ్రూ పాలిటెక్నిక్ కళాశాల, నాంపల్లి
30. హైదరాబాద్: చాంద్రాయణగుట్ట నిజాం కళాశాల, బషీర్ బాగ్
31. హైదరాబాద్: యాకత్ పురా సరోజిని నాయుడు వనితా మహావిద్యాలయ, నాంపల్లి
32. హైదరాబాద్: బహదూర్ పురా అరోరా కళాశాల, బండ్లగూడ
33. హైదరాబాద్ సికింద్రాబాద్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్, ఓయూ
34. హైదరాబాద్ కంటోన్మెంట్ వెస్లీ కళాశాల, సికింద్రాబాద్
35. నారాయణపేట: నారాయణపేట, మక్తల్ శ్రీదత్త బృందావన్ ఇనిస్టిట్యూట్, సింగారం
36. మహబూబ్ నగర్: మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల, మహబూబ్ నగర్
37. నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ ఏఎంసీ గోడౌన్, నాగర్ కర్నూల్
38. వనపర్తి: వనపర్తి ఏఎంసీ గోడౌన్, చిట్యాల
39. జోగులాంబ గద్వాల: గద్వాల, అలంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్, గద్వాల
40. నల్గొండ: దేవరకొండ, నాగార్జున్ సాగర్, మిర్యాలగూడ, నల్గొండ, మునుగోడు, నకిరేకల్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ గోడౌన్స్, దుప్పలపల్లి
41. సూర్యాపేట: హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, తుంగుతుర్తి ఏఎంసీ గోడౌన్, సూర్యాపేట
42. యాదాద్రి భువనగిరి: భువనగిరి, ఆలేరు ఆరోరా అకాడమీ, రాయిగిరి
43 జనగాం: జనగాం, స్టేషన్ ఘన్ పూర్, పాలకుర్తి విద్యాభారతి ఇనిస్టిట్యూట్, పెంబర్తి
44. మహబూబాబాద్: డోర్నకల్, మహబూబాబాద్ ఎస్సీ బాలికల గురుకుల కళాశాల, మహబూబాబాద్
45. వరంగల్: నర్సంపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరకాల, వర్ధన్నపేట ఏఎంసీ గోడౌన్, ఎనుమాముల
46. జయ శంకర భూపాలపల్లి: భూపాలపల్లి సీఈఆర్ క్లబ్, భూపాలపల్లి
47. ములుగు: ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం, ములుగు
48. భద్రాద్రి కొత్తగూడెం: పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం అనుబోస్ ఇనిస్టిట్యూట్, పాల్వంచ
49. ఖమ్మం: ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి శ్రీచైతన్య కళాశాల, పొన్నేకల్.

READ MORE  సీకేఎం కళాశాల ఇక నుంచి సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..