Home » TSRTC Electric Buses: త్వరలో అన్ని మార్గాల్లో ఎలక్ట్రిక్ బస్సులు : ఆర్టీసీ ఎండీ ఎండీ సజ్జనార్
EV Bus

TSRTC Electric Buses: త్వరలో అన్ని మార్గాల్లో ఎలక్ట్రిక్ బస్సులు : ఆర్టీసీ ఎండీ ఎండీ సజ్జనార్

Spread the love

TSRTC Electric Buses: తెలంగాణ వ్యాప్తంగా సుదూర ప్రాంతాలకు త్వరలోనే ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టబోతున్నాయి. ప్రస్తుతం విజయవాడ మార్గంలో 10 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు నడుస్తుండగా,  త్వరలో మిగతా రూట్లలో కూడా ప్రవేశపెట్టనున్నారు.

TSRTC Electric Buses : తెలంగాణలో అతి త్వరలో ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. డిసెంబర్ లో ఈ బస్సులు రోడ్లు ఎక్కనున్నాయి. ఇప్పటికే 1,860 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చిన సంస్థ.. వాటిలో కొన్నింటిని డిసెంబర్ లో వినియోగంలోకి తెచ్చేలా ప్రణాళిక చేస్తోంది.

READ MORE  నిండైన చీరకట్టుతో ఈ మహిళ చేసిన డ్యాన్స్ అదుర్స్..

హరియాణా పల్వాల్ లో జేబీఎం గ్రూప్ సంస్థలో తయారవుతున్న కొత్త ఎలక్ట్రిక్ బస్సుల నిర్మాణం తీరును టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ స్వయంగా పరిశీలించారు. వివిధ దశల్లో నిర్మాణం లో ఉన్న ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులను ఆయన క్షుణ్ణంగా  తనిఖీ చేశారు.

టీఎస్ఆర్టీసీకి అందిస్తున్న రెండు నమూనా బస్సులను పరిశీలించారు. జేబీఎం గ్రూప్ హెడ్ సేల్స్ (నార్త్) ముఖేశ్ శర్మ, జీఎం ఆపరేషన్స్ ప్రశాంత్ శర్మ తో చర్చించి పలు సూచనలు చేశారు. ఈ బస్సుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి టీఎస్ఆర్టీసీకి అందించాలని వారిని ఎండీ వీసీ సజ్జనార్ కోరారు..

READ MORE  Praja Palana Application Status : ప్రజాపాలన దరఖాస్తులపై 'స్టేటస్ చెక్' ఆప్షన్ వచ్చేసింది... ఒక్కసారి చెక్ చేసుకోండి..

అదిరే ఫీచర్లతో..

జేబీఎం గ్రూప్ 500 ఎలక్ట్రిక్ బస్సులను ఒప్పందం ప్రకారం టీఎస్ఆర్టీసీకి సరఫరా చేయనుంది. వాటిని విడతల వారీగా ఆ కంపెనీ అందించనుంది. డిసెంబర్ లో కొన్ని ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికులకు సౌకర్యాల విషయంలో ఎలాంటి రాజీ పడకుండా అత్యాధునిక హంగులతో ఈ బస్సులను సంస్థ వాడకంలోకి తెచ్చేలా చర్యలు చేపడుతుందని ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు.

ఈ బస్సుల్లో ప్రయాణికులను లెక్కించే సదుపాయంతో పాటు భద్రతకు సీసీటీవీ కెమెరాల ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సు ల్లో ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

READ MORE  Driving License Rules | డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీలో కీలక అప్ డేట్..

బస్సు రివర్స్‌ చేసేందుకు వీలుగా రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టె న్స్‌ కెమెరా కూడా ఉంటుందని, గమ్యస్థానాల వివరాల కోసం బస్సులో ఎల్ఈడీ బోర్డులు ఉంటాయని తెలిపారు.

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..